సాక్షి,న్యూఢిల్లీ: నోకియా బడ్జెట్ ధరలో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో పనిచేసే నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.5,499గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి( బుధవారం) దీని విక్రయానికి అందుబాటులో ఉంటుదని కంపెనీ ప్రకటించింది. గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 1 గో ఎడిషన్‌ను పరిచయం చేసింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు రిలయన్స్ జియో ద్వారా క్యాష్ బ్యాక్‌ఆఫర్ కూడా ఉంది.
జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్
టెలికం సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ జియో రూ. 2,200, క్యాష్ బ్యాక్ తో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 3,299 లభ్యం కానుందని హెచ్‌ఎండీ గ్లోబల్ వెల్లడించింది. అంతేకాదు 60జీబీ డేటా ఉచితం. అలాగే కోటక్ 811 పొదుపు ఖాతా తెరవడంద్వారా మొబైల్ 12 నెలల ప్రమాదం బీమా రెడ్‌బస్‌లో ఫస్ట్‌బుకింగ్‌పై 20 శాతం డిస్కౌంట్ ఉంటుందని సంస్థ ప్రకటనలో పేర్కొంది.
నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఫీచర్లు
4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే
480x854 పిక్సెల్ రిజల్యూషన్
1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
1జీబీ ర్యామ్
8జీబీ స్టోరేజీ
128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
5 ఎంపీ వెనుక కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
2150 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment