
ఎయిర్‌సెల్ తన అపరిమిత కాలింగ్ ప్లాన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ పే బ్యాలెన్స్ వాడి పేమెంట్లను జరిపిన వారికి ఈ క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు తెలిపింది. అమెజాన్.ఇన్, పే బ్యాలెన్స్ ద్వారా కొనుగోలు చేసిన ఎంపికచేసిన ఎయిర్‌సెల్ రీఛార్జ్‌లకు మాత్రమే ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.75 మేర క్యాష్‌బ్యాక్ అందించనున్నట్టు పేర్కొంది. అదనంగా రూ.146 ప్లాన్‌ను ఎయిర్‌సెల్ లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ కింద 28 రోజుల పాటు 5జీబీ 3జీ, 2జీ డేటాను, అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఎయిర్‌సెల్ మొబైల్ యాప్, అమెజాన్ ద్వారా తాము బెస్ట్ రీఛార్జ్‌లను ఆఫర్ చేయనున్నామని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ చెప్పారు.
ఎయిర్‌సెల్ యాప్, అమెజాన్ పేపై ఈ విలువ ఆధారిత ఆఫర్లతో వినియోగదారులను ఆహ్లాదపరచడం మాత్రమే కాకుండా, తమ ఫోన్లలో లభించే డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని స్వీకరించి, ఆ స్థాయిలను పెంచాలని నిశ్చయించుకున్నారు. ఎయిర్‌సెల్‌తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అమెజాన్ పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ జగనాథన్ చెప్పారు. కాగ, ఎయిర్‌సెల్‌కు, ఇతర టెల్కోలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి షాకిస్తూ తాజాగా త్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.399, ఆపై మొత్తాలపై రూ.2,599 విలువైన ప్రయోజనాలు తమ ప్రైమ్ యూజర్లకు అందించనున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment