ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు విభిన్న రంగాల్లో ఈయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అక్కడ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఆనంద కృష్ణన్ నిలిచారు. తన మృతిని ధ్రువీకరిస్తూ మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ చాలా సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణన్ సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయం’ అని ఇబ్రహీం అన్నారు.
ఎవరీ ఆనంద కృష్ణన్?
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ ప్రాంతంలో కృష్ణన్ ఏప్రిల్ 1, 1938న జన్మించారు. కృష్ణన్ పూర్వీకులకు భారత్‌తో సంబంధం ఉంది. ఆనంద మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1964లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పట్టా పొందరు. తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి చాలా అభివృద్ధి చెందారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆనందకు ముగ్గురు సంతానం. తన కుమారుడు థాయిలాండ్‌లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు అతని వ్యాపార నిర్వహణలో పాలుపంచుకోలేదు.
ఐపీఎల్ టీమ్‌కు స్పాన్సర్‌గా కూడా..
ఒకప్పుడు ఆనంద ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను స్పాన్సర్ చేశారు. గతంలో దక్షిణాదిలో కార్యకలాపాలు సాగించిన ఎయిర్‌సెల్ టెలికాం కంపెనీకి సారథ్యం వహించారు. ఫోర్బ్స్ ప్రకారం కృష్ణన్ ప్రముఖ డీల్ మేకర్లలో ఒకరిగా ఎదిగారు. చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించారు. మల్టీమీడియా వెంచర్లను ప్రారంభించారు. మ్యాక్సిస్ బీహెచ్‌డీ అనే టెలికా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆనంద కృష్ణన్ మలేషియాలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచారు.
అవినీతి ఆరోపణలు
2006లో ఎయిర్‌సెల్‌పై మాక్సిస్ నియంత్రణ సాధిస్తుందని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి దేశంలోని పలు కంపెనీలు అభియోగాలు మోపడంతో కోర్టులో కేసు నడుస్తోంది.
ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
ఆనంద స్థాపించిన కొన్ని ప్రముఖ కంపెనీలు
ఆస్ట్రో మలేషియా హోల్డింగ్స్: మలేషియాలో ప్రముఖ శాటిలైట్ టెలివిజన్ ప్రొవైడర్.
బుమి అర్మడా: ఈ సంస్థ చమురు సర్వీస్ అందిస్తోంది.
ఎయిర్ సెల్: ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఎయిర్ సెల్.
Comments
Please login to add a commentAdd a comment