Ananda Krishnan
-
ఎయిర్‌సెల్ అధినేత కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు విభిన్న రంగాల్లో ఈయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అక్కడ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఆనంద కృష్ణన్ నిలిచారు. తన మృతిని ధ్రువీకరిస్తూ మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ చాలా సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణన్ సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయం’ అని ఇబ్రహీం అన్నారు.ఎవరీ ఆనంద కృష్ణన్?మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ ప్రాంతంలో కృష్ణన్ ఏప్రిల్ 1, 1938న జన్మించారు. కృష్ణన్ పూర్వీకులకు భారత్‌తో సంబంధం ఉంది. ఆనంద మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1964లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పట్టా పొందరు. తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి చాలా అభివృద్ధి చెందారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆనందకు ముగ్గురు సంతానం. తన కుమారుడు థాయిలాండ్‌లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు అతని వ్యాపార నిర్వహణలో పాలుపంచుకోలేదు.ఐపీఎల్ టీమ్‌కు స్పాన్సర్‌గా కూడా..ఒకప్పుడు ఆనంద ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను స్పాన్సర్ చేశారు. గతంలో దక్షిణాదిలో కార్యకలాపాలు సాగించిన ఎయిర్‌సెల్ టెలికాం కంపెనీకి సారథ్యం వహించారు. ఫోర్బ్స్ ప్రకారం కృష్ణన్ ప్రముఖ డీల్ మేకర్లలో ఒకరిగా ఎదిగారు. చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించారు. మల్టీమీడియా వెంచర్లను ప్రారంభించారు. మ్యాక్సిస్ బీహెచ్డీ అనే టెలికా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆనంద కృష్ణన్ మలేషియాలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచారు.అవినీతి ఆరోపణలు2006లో ఎయిర్‌సెల్‌పై మాక్సిస్ నియంత్రణ సాధిస్తుందని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి దేశంలోని పలు కంపెనీలు అభియోగాలు మోపడంతో కోర్టులో కేసు నడుస్తోంది.ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!ఆనంద స్థాపించిన కొన్ని ప్రముఖ కంపెనీలుఆస్ట్రో మలేషియా హోల్డింగ్స్: మలేషియాలో ప్రముఖ శాటిలైట్ టెలివిజన్ ప్రొవైడర్.బుమి అర్మడా: ఈ సంస్థ చమురు సర్వీస్ అందిస్తోంది.ఎయిర్ సెల్: ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఎయిర్ సెల్. -
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవునా.. నిజమేనా...?
హైదరాబాద్‌లోని ఓ గల్లీ అది.. ఒంటరిగా నడుస్తున్న ఓ మహిళ.. సడన్‌గా ఓ యువకుడు బైక్ మీద వచ్చి మెడలో గోల్డ్ చైన్ లాక్కుని వెళతాడు! ఊహించని ఘటనతో ఆ ఏరియాలో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు చెన్నై, బెంగళూర్.. ఇలా ప్రతి నగరంలో చైన్ స్నాచింగ్ ముఠాలున్నాయి. ఇలాంటి వార్తను కవర్ చేసిన ఓ రిపోర్టర్... చైన్ స్నాచర్లకు చెక్ పెడితే ఎలా ఉంటుందనే కథాంశంతో తమిళంలో ‘మెట్రో’ అనే చిత్రం తెరకెక్కింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడీ చిత్రాన్ని అక్కినేని నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని తమిళ ‘మెట్రో’ దర్శక, నిర్మాతలు ఆనంద్ కృష్ణన్, జయ కృష్ణన్‌ల ఆలోచన. చైతూని కలసి కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మోడరన్ డే క్రిమినల్స్, చైన్ స్నాచింగ్, సైకోయిజం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రకథ అక్కినేని యువ హీరోకి బాగా నచ్చిందట. ఇదిలా ఉంటే.. మరో తమిళ చిత్రం ‘ఎట్టి’ రీమేక్‌లోనూ చైతన్య నటించడానికి అంగీకరించారని కోలీవుడ్ టాక్. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ఆల్రెడీ తమిళ ‘వేట్టై’ తెలుగు రీమేక్ ‘తడాఖా’తో చైతు హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘ప్రేమమ్’ కూడా మలయాళ ‘ప్రేమమ్’కి రీమేకే. చైతూకి కథ నచ్చితే చాలు.. రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అర్థమవుతోంది. అన్నట్టు... చైతూ మేనమామ, హీరో వెంకటేశ్ కూడా పలు రీమేక్ చిత్రాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేయక్కర్లేదేమో.