![Reliance Jio brings 100percent cashback offer on Diwali, unlimited 4G data for one year - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/30/jio.jpg.webp?itok=l8lpehPm)
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ సారధ్యంలోని టెలికం కంపెనీ రిలయన్స్ జియో బంపర్‌ఆఫర్ తీసుకొచ్చింది. గత ఏడాది దీపావళి సందర్భంగా లాంచ్ చేసిన ధనాధన్ ఆఫర్‌లాంటి ఆఫర్‌ను ఈ ఏడాది కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో దివాలీ ఆఫర్ 100 శాతం క్యాష్‌బ్యాక్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని ప్రకారం రూ .149 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై వంద శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
నవంబర్ 30వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జియో ప్రైమ్ సభ్యులతో పాటు కొత్త, పాత జియో సభ్యులందరూ ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. దీపావళి ఆఫర్‌గా ప్రీపెయిడ్ రీచార్జ్‌లపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్. రూ .149, రూ. 198, రూ 299, రూ .349, రూ. 398, రూ 399, రూ .448, రూ 449, 498, రూ .509, రూ. 799, రూ. 999, రూ. 1699, రూ. 1999, రూ. 4999 రూ. 9999. ప్లాన్లపై ఈ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ రిలయన్స్ డిజిటల్ కూపన్లు రూపంలో ఉంటుంది. రూ.509 వరకు రీచార్జ్‌లపై ఒక కూపన్‌ను అందిస్తోంది. ఆపైన రీచార్జ్‌లపై అందించే కూపన్లు ఒకటి కంటే ఎక్కువ కూపన్లలో ఆఫర్ చేయనుంది. డిసెంబరు 31, 2018 వరకు క్యాష్ బ్యాక్ కూపన్లు చెల్లుతాయి. రిలయెన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో రూ.5 వేలు, అంతకన్నా ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో మాత్రమే ఈ కూపన్లను వాడుకోవచ్చు.
కాగా దాదాపు ఇవే నిబంధనలతో ఇటీవల రూ.1699 ప్లాన్ కింద 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించేలా అన్‌లిమిటెడ్ ఏడాది ప్లాన్‌ను కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment