
ఎంపికచేసిన మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్లపై టెలికాం దిగ్గజం వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మైక్రోమ్యాక్స్‌తో కొత్త భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నట్టు గురువారం ప్రకటించిన వొడాఫోన్, ఈ మేరకు క్యాష్‌బ్యాక్ వివరాలను కూడా వెల్లడించింది. గురువారం ప్రకటించిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్, మైక్రోమ్యాక్స్ భారత్ 3, మైక్రోమ్యాక్స్ భారత్ 4, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 1 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వొడాఫోన్ కొత్త, పాత కస్టమర్లు పైన పేర్కొన్న ఆ నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు 36 నెలల పాటు నెలకు కనీసం రూ.150 వరకు వొడాఫోన్ రీఛార్జ్‌లు చేయించుకోవాలి. ఇలా చేసిన కస్టమర్లకు తొలి 18 నెలలు ముగియగానే, రూ.900 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత 18 నెలలు ముగియగానే రూ.1300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు. సబ్‌స్క్రైబర్ వొడాఫోన్ ఎం-పెసా వాలెట్‌లో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేయనున్నారు. గత నెలలో కూడా వొడాఫోన్, మైక్రోమ్యాక్స్‌లు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. అప్పుడు మైక్రోమ్యాక్స్ భారత్ 2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ.999కే అందుబాటులోకి వచ్చింది.
మోడల్ పేరు భారత్2 ప్లస్ భారత్ 3 భారత్ 4 కాన్వాస్ 1
18 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్ రూ.900 రూ.900 రూ.900 రూ.900
36 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్ రూ.1300 రూ.1300 రూ.1300 రూ.1300
మార్కెట్ ఆపరేటింగ్ ధర రూ.3749 రూ.4499 రూ.4999 రూ.5999
మొత్తం క్యాష్‌బ్యాక్ రూ.2200 రూ.2200 రూ.2200 రూ.2200
తుది ధర రూ.1549 రూ.2299 రూ.2799 రూ.3799
Comments
Please login to add a commentAdd a comment