సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ భారీ బ్యాటరీతో ‘భారత్ 5’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ డివైస్‌లో అతిపెద్ద హైలైట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే మరో విశేషం రూ.5555 ధరకే ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేవడం. అలాగే వొడాఫోన్‌తో భాగస్వామ్యంలో డేటా ఆఫర్ కూడా ఉంది. దేశంలో ఆఫ్‌లైన్ రిటైలర్లు ద్వారా కొనుగోలు చేయడానికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది
మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో తరువాత దిశగా భారత్‌ను తీసుకెళతాయని, ఈ క్రమంలో ఇప్పటికీ తీవ్రమైన విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న దేశంలోని 3-4 టైర్ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్‌లు కీలకంగా నిలుస్తాయన్నారు.
లాంచింగ్ ఆఫర్
దేశ్‌కా స్మార్ట్‌ఫోన్ అంటూ లాంచ్ అయిన రెడ్‌మీ5ఏ కీ పోటీగా తీసుకొచ్చిన భారత్ 5 లాంచింగ్ ఆఫర్‌గా వొడాఫోన్ కస్టమర్లకు 5నెలలు 50జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది. అంటే 1జీబీ డేటా అందించే ఏదైనా వోడాఫోన్ ప్యాక్‌లో కస్టమర్లకు అదనంగా 10 జీబీ డేటాను 5నెలలపాటు ఉచితంగా అందిస్తుంది.
మైక్రోమ్యాక్స్ భారత్ 5 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగాట్
720x1280 పిక్సల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
64జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
5 మెగాపిక్సెల్ బ్యాంక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment