సాక్షి, న్యూఢిల్లీ: దేశ్‌కా స్మార్ట్‌ఫోన్ అంటూ షావోమి బడ్జెట్‌ధరలో రెడ్ మి 5ఏను గురువారం లాంచ్ చేసింది. మరోవైపు రెడ్‌మీ షాకిస్తూ దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్‌కూడా మరో బడ్జెట్ ఫోన్‌ను రేపు (శుక్రవారం) విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. బడ్జెట్‌ఫోన్ల మార్కెట్లో భారత్ ఫోన్ల సిరీస్లో ‘భారత్ 5’ పేరుతో మైక్రోమాక్స్ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
డిసెంబర్ 1 గుర్గావ్‌లో ‘భారత్ 5’ (పవర్ ఆఫ్ 5) ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం అందించింది. సోషల్ మీడియాలో టీజర్ ను షేర్ చేసింది. దీని ప్రకారం కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో రానుందనే అంచనాలు నెలకొన్నాయి. ‘పవర్ ఆఫ్ 5 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో లేదా 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలతో రానుందట. మిగిలిన ఫీచర్లు, ధర విషయాలో రేపటి వరకు సస్పెన్స్ తప్పదు.
కాగా మైక్రోమ్యాక్స్ రూ. 3,499 ధరలలో ఏప్రిల్లో భారత్ 2 లాంచ్ చేసింది. సెప్టెంబర్లో మైక్రోమ్యాక్స్ 4జీ వీవో ఎల్‌టీఈ సేవలతో భారత్ 3, భారత్ 4లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment