నాణ్యతా లోపాలను సహించం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతాలోపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరం గల్ జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారు లు, వర్క్ ఏజెన్సీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నాబార్డ్, పీఎంజీ ఎస్‌వై నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి అడ్డగోలుగా అంచనాలను పెంచినా, పనులు చేయడంలో జాప్యం జరిగినా కఠిన చర్యలు తీసు కుంటామన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు మెమోలు జారీచేయడంతో పాటు, ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచిం చారు. అనుమతిచ్చిన వారంలోపే పనులు ప్రారంభించాలని, 15 రోజుల్లోగా శంకు స్థాపన జరగాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రహదారులు, వంతెనల పనులన్నీ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.