బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్‌జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇరువైపుల మొత్తం 9 మంది మృతి చెందారు. ఈ ఎదురు కాల్పులలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు.
బీజాపూర్ జిల్లాలోనే ఈ నెల 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గంగలూరు పోలీసులు అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పిడియా గ్రామం వద్ద మావోలతో ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకి, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.