రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద మందు పాతరలు పేల్చారు. రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య)
ఇదిలా ఉండగా.. పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో లేఖ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment