
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం విహారయాత్ర పెనువిషాదాన్ని నింపింది. విహారయాత్రకని వెళ్లిన 20 మంది బాలికల బృందంలోని ఇద్దరు పడవలో ప్రయాణిస్తూ అదుపు తప్పి నీటిలో పడి గల్లంతయ్యారు. బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. 20 మంది బాలికల బృందం బీజాపూర్ జిల్లాలోని మింగాచల్ నదికి విహారయాత్రకని వచ్చారు. వారిలో ఇద్దరు బాలికలు సరదాగా పడవ ఎక్కారు. అయితే కాసపటికే ప్రమాదవశాత్తు పడవ నదిలో బోల్తా పడడంతో ఇద్దరు బాలికలు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన మిగతా బాలికలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment