సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పథకం మోదీ కేర్‌గా పిలిచే ఆయుష్మాన్ భారత్‌ను ఈనెల 14న చత్తీస్‌ఘర్‌లోని బీజాపూర్‌లో ఆయన ప్రారంభించనున్నారు. పథకం కింద దేశంలోనే తొలి వెల్‌నెస్ సెంటర్‌ను మోదీ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 115 జిల్లాలను ఈ పథకం కిందకు తీసుకువస్తూ రియల్‌టైమ్ పర్యవేక్షణ చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలను మిళితం చేయడం, ప్రజా ఉద్యమం ద్వారా జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రేరేపించడం వంటి చర్యలను చేపడతారు. మెరుగైన ఫలితాలను సాధించిన జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తారు.
ఆయుష్మాన్ భారత్ కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. వ్యాధుల నియంత్రణ, నివారణ, ముందస్తు జాగ్రత్తలే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తారు.దేశంలోని పేద కుటుంబాలకు రూ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment