సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయట! | Rare Belief In Karnataka Bijapur If The Graves Are Dug And The Thirst Of The Dead Is Quenched It Will Rain | Sakshi
Sakshi News home page

వింత ఆచారం.. వాళ్ల సమాధులకు నీరు పోస్తే వానలు!

Published Sat, Jul 16 2022 8:53 AM | Last Updated on Sat, Jul 16 2022 8:57 AM

Rare Belief In Karnataka Bijapur If The Graves Are Dug And The Thirst Of The Dead Is Quenched It Will Rain - Sakshi

సమాధులు తవ్వితే ఎముకలొస్తాయి. కానీ... సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయని నమ్ముతున్నారు. ఎక్కడో కాదు.. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్‌ జిల్లా కలకేరిలో  కొన్ని రోజులుగా వానలు పడకపోవడంతో చనిపోయినవాళ్ల శాపమేనని నమ్మిన గ్రామస్తులు... గత నెలలో మరణించినవాళ్ల జాబితా తీశారు. వాళ్ల సమాధులకు తల ఎటువైపున్నాయో కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించారు. తలకు రెండు అడుగుల దూరంలో ఓ గుంత తవ్వి చనిపోయిన వాళ్ల నోరువైపుగా పైపు పెట్టి వాటర్‌ ట్యాంకర్‌తో నీటిని వదిలారు. 25 సమాధులకు అలా నీటిని పోసి, ప్రక్రియ పూర్తి చేసిన కొద్దిసేపటికే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయట.

.3వేల జనాభా ఉన్న కలకేరి గ్రామస్తుల్లో ఈ నమ్మకం కొన్నేళ్ల కిందటే బలపడింది. నోరు తెరిచి చనిపోయిన ఓ వృద్ధుడి నోటిని మూ­య­కుండానే ఖననం చేశారట. అప్పటినుంచి వానలు పడక... గ్రామం­లో తీవ్రమైన కరువు వచ్చిందట. ఓ జ్యోతిష్యుడి దగ్గరకెళ్లి అడిగితే... చనిపోయిన వృద్ధుడి గురించి చెప్పాడట. వెంటనే వెళ్లి అతని స­మాధిని తవ్వి నీటిని పోస్తే... వర్షం వచ్చిందట. ఇక అప్పటినుంచి దాన్నే నమ్ముతూ వానలు రానప్పుడల్లా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ వింత నమ్మకాలు మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ఉన్నా­యి. గ్రామంలో వానలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇటీవల ఓ మెక్సికన్‌ మేయర్‌ మొసలినే పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement