grav yard
-
సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయట!
సమాధులు తవ్వితే ఎముకలొస్తాయి. కానీ... సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయని నమ్ముతున్నారు. ఎక్కడో కాదు.. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా కలకేరిలో కొన్ని రోజులుగా వానలు పడకపోవడంతో చనిపోయినవాళ్ల శాపమేనని నమ్మిన గ్రామస్తులు... గత నెలలో మరణించినవాళ్ల జాబితా తీశారు. వాళ్ల సమాధులకు తల ఎటువైపున్నాయో కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించారు. తలకు రెండు అడుగుల దూరంలో ఓ గుంత తవ్వి చనిపోయిన వాళ్ల నోరువైపుగా పైపు పెట్టి వాటర్ ట్యాంకర్‌తో నీటిని వదిలారు. 25 సమాధులకు అలా నీటిని పోసి, ప్రక్రియ పూర్తి చేసిన కొద్దిసేపటికే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయట. .3వేల జనాభా ఉన్న కలకేరి గ్రామస్తుల్లో ఈ నమ్మకం కొన్నేళ్ల కిందటే బలపడింది. నోరు తెరిచి చనిపోయిన ఓ వృద్ధుడి నోటిని మూయకుండానే ఖననం చేశారట. అప్పటినుంచి వానలు పడక... గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ఓ జ్యోతిష్యుడి దగ్గరకెళ్లి అడిగితే... చనిపోయిన వృద్ధుడి గురించి చెప్పాడట. వెంటనే వెళ్లి అతని సమాధిని తవ్వి నీటిని పోస్తే... వర్షం వచ్చిందట. ఇక అప్పటినుంచి దాన్నే నమ్ముతూ వానలు రానప్పుడల్లా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ వింత నమ్మకాలు మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రామంలో వానలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇటీవల ఓ మెక్సికన్ మేయర్ మొసలినే పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్ -
పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
-
‘86 శ్మశానాలు కబ్జా అయితే ఐదు కేసులేనా?’
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా చట్టపరంగా సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బోర్డు సీఈవో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో 86 ముస్లిం శ్మశానాలను కబ్జాదారులు ఆక్రమించారని తేలినా.. కేవలం 5 చోట్ల మాత్రమే కేసులు నమోదు చేయించడం ఏమిటని నిలదీసింది. వక్ఫ్ ఆస్తులను కాపాడటంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఈవోను ఇంటికి పంపడమే మేలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సీఈవోపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ వెల్ఫేర్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాలలోని ముస్లింల శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా వక్ఫ్‌బోర్డు చర్యలు చేపట్టడం లేదని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త మహ్మద్ ఇలియాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. (చదవండి: మెరూన్ పాస్‌బుక్ ఇవ్వకండి) ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు సీఈవో మహ్మద్ కాసీం విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు లేఖలు రాశామని కాసీం వివరించారు. అయితే ఇది సివిల్ వివాదమని, కేసులు నమోదు చేయలేమంటూ వారు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. అక్కడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వకపోతే నేరుగా న్యాయస్థానం ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటూ మండిపడింది. తనకు సీఆర్పీసీ గురించి తెలియదని కాసీం వ్యాఖ్యానించడంపై ధర్మాసనం స్పందిస్తూ ఇంత చేతగానీ సీఈవో ఉంటే వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 18 ఏళ్లు గడిచినా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అక్రమార్కులపై వెంటనే చట్టపరంగా తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఇర్ఫాన్ ఖాన్‌కు మనమిచ్చే గౌరవం ఇదేనా?
ముంబై : దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్ సమాధిని పాలరాయితో కట్టించాలని నటుడు శేఖర్ సుమన్ అన్నారు. చిత్రపరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఇర్ఫాన్‌కు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఇండస్ర్టీపై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఇర్ఫాన్ సమాధి అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన ఇర్ఫాన్‌కు తగిన గౌరవం ఇచ్చేలా వైట్ మార్భుల్స్‌తో పాలరాతి సమాధి కట్టించాలని, దీనికి చిత్రపరిశ్రమ ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దార్ ఇర్ఫాన్ గురించిన చేసిన పోస్ట్‌పై ఓ అభిమాని స్పందిస్తూ ఇర్ఫాన్ సమాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. (‘ఆయన జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు’) ఆ స్మశానవాటిక చెత్తకుండీలా ఉందని, అలాంటి ప్రదేశంలో ఇర్ఫాన్ సమాధి ఉండటం ఏంటని ప్రశ్నించారు. అసలు ఇది నిజమేనా లేకపోతే స్మశానవాటిక ఫోటో పంపాల్సిందిగా ఇర్ఫాన్ భార్య సుతాపకు ట్వీట్ చేయగా..ముస్లిం మహిళలు అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదని సుతాప బదులిచ్చింది. ఇక స్మశానవాటిక గురించి స్పందిస్తూ..అడవుల్ని, మొక్కల్ని ఎంతో ఇష్టపడే ఇర్ఫాన్ సమాధిని అందుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటుచేశాం. దాన్నొక అందమైన ప్రదేశంగా చూడాలని, ఇర్ఫాన్ ఆత్మ ఎల్లప్పుడూ తనతోనే ఉంటుందని పేర్కొంది. విలక్షణ నటుడు ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించిన విషయం తెలిసిందే. (‘కలువ పూలు నిన్ను గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్’) This is d late actor Irrfan Khan's grave.Does it teach anything about life?After all the fame n adulation,International acclaim,you lie alone in an unkempt grave.Can the industry wake up and at least get this place done in white marble wid a loving epitaph? pic.twitter.com/nJWTspC53M — Shekhar Suman (@shekharsuman7) September 30, 2020 -
తాజ్‌మహల్ ఓ అందమైన శ్మశానం
-
తాజ్‌మహల్ ఓ అందమైన శ్మశానం
చండీగఢ్: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అని హరియాణా క్రీడల మంత్రి అనిల్ విజ్ శుక్రవారం ట్వీట్ చేశారు. గతంలోనూ విజ్ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు. భారత వారసత్వం, చరిత్రలో తాజ్‌మహల్ స్థానం ఏంటంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైన సంగతి తెలిసిందే. -
కబరస్థాన్ కూల్చివేత.. పరిస్థితి ఉద్రిక్తం
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో గల కబరస్థాన్ కూల్చివేత వివాదంగా మారింది. దీంతో గ్రామంలో పోలీసుల భారీగా మోహరించారు. గ్రామంలో ఉద్రికత పరిస్థితులు తలెత్తడంతో సంఘటన స్థలాన్నీ కమిషనర్ సందర్శించారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నెం.1660, 1661, 1662లలో ఐదు సంవత్సరాల క్రితం పంజల దుర్గయ్య భూమిలోని కొంత స్థలంలో ఖబరస్థాన్ నిర్మించారంటూ ఈద్గా కమిటీతో భూతగాదా కొనసాగుతూ వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున దుర్గయ్య, మరో నలుగురు వ్యక్తులు కబరస్థాన్ కూల్చారంటూ ఈద్గా కమిటీ అధ్యక్షులు మహ్మద్ రఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలంలో ఏమి జరుగుతుందో తెలియక ఉద్రిక్తత నెలకొంది. సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ముస్లిం మత పెద్దలు శాంతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.