చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అని హరియాణా క్రీడల మంత్రి అనిల్ విజ్ శుక్రవారం ట్వీట్ చేశారు. గతంలోనూ విజ్ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు.