ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ | woman maoist died in encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

Published Sun, Feb 19 2017 3:44 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

woman maoist died in encounter

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజీపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. జిల్లాలోని పామేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కవర్‌గట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.
 
ఈ కాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టు మృతి చెందింది. సంఘటనా స్థలం నుంచి రెండు తుపాకులతో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి సొం‍తం చేసుకున్నారు. ఈ మేరకు బీజాపూర్‌ ఎస్పీ కె.ఎల్‌ ధువ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement