హైదరాబాద్ : పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చిన్నకోడెపల్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తూ.. మావోల సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నాడనే అనుమానంతో శనివారవ రాత్రి గ్రామ సర్పంచ్‌ను ఎత్తుకెళ్లిన మావోలు తుపాకితో కాల్చి చంపి గ్రామ శివారులో పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.