ప్రతీకాత్మక చిత్రం
చత్తీస్‌గఢ్ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. సమాజ్ వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంను కాల్చి చంపారు. బీజాపూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం అందించిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్ , మరిముల్లాకు చెందిన సంతోష్ పూనెంను మంగళవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ సుధేరాజ్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు 15 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఈ ఘటన జరిగిట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించామని, వారి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా సంతోస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పీ పార్టీ తరపున బీజాపూర్‌నుంచి పోటీచేశారు.ప్రస్తుతం బస‍్తర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment