ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
Published Sat, Oct 8 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
హైదరాబాద్: మహారాష్ట్ర బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయాడు. బిజాపూర్ ఎస్పీ కె.ఎల్.ధ్రువ్ తెలిపిన వివరాలివీ..నక్సల్స్ కదలికల సమాచారం అందటంతో శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు దుబాయిగూడ అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య దాదాపు గంటపాటు కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు పారిపోగా ఆ ప్రాంతంలో పడి ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఏరియా కమాండర్‌గా భావిస్తున్నారు. అతడి వద్ద ఉన్న .303 రివాల్వర్‌తో పాటు సంకేత భాషలో ఉన్న పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement