Nurse shares first dance with husband: రష్యా గత రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో వేలాది మంది నిరాశ్రయలవ్వగా, లక్షలాదిమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లిపోయారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ శిథిలానగరంగా మారిపోవడమే కాకుండా అక్కడ భూభాగాలన్నీ పేలని మందుపాత్రలు, మందుగుండు సామాగ్రితో నిండిపోయింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో లుహాన్స్‌లోని ఒక్సానా బాలండినా, వాసిలివ్ అనే జంట ఇంటికి వెళ్తున్న సమయంలో ఊహించని భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. బాలండినా నడుస్తున్నప్పుడూ పొరపాటున ల్యాండ్‌మైన్ పై పడిపోయింది.
అంతే ఒక్కసారిగా ల్యాండ్‌మైన్ పెద్ద శబ్దంతో పేలడంతో ఆమె నెలపై ఒకవైపుగా పడిపోయింది. ఐతే ఆమె వెనుకే వస్తున్న ఆమె భర్తకి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో బాలండినాను ఆమె భర్త వాసిలివ్ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఐతే ఆమె ఆ సమయంలో అచేతనంగా పడి ఉందని తనకు ఏమ చేయాలో కూడా పాలిపోలేదని చెబుతున్నాడు. తాను ఇక బతకుతుందని కూడా అనుకోలేదని ఆశలన్ని వదిలేసుకున్నాని చెప్పుకొచ్చాడు. మరొవైపు రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతుండటంతో వారు ఆసుపత్రిలోనే నెలరోజుల పైనే గడపాల్సి వచ్చింది. ఇంకోవైపు వైద్యులు బాలండినాకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె ఈ ప్రమాదం కారణంగా రెండు కాళ్లను, ఎడమ చేతి నాలుగు వేళ్లను కోల్పోయింది.
తర్వాత కొన్ని రోజులకు ఆమె కోలుకోవడం ప్రారంభించింది. బాలండినా మాత్రం తాను చాలా రోజులు చీకటి గదిలో గడపానని, ఇక జీవించాలని అనుకోలేదంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. తన భర్త సహకారంతో తాను ఈ రోజు పూర్తిగా కోలుకుని బయటపడిగలిగానని చెప్పుకొచ్చింది. బాలండినా ఒక నర్సు, ఆమెకు ఏడేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురు ఉన్నారు. ఈ మేరకు ఆమె నాటి ఘటన తదనంతరం కోలుకుని ఆరోగ్యంగా పూర్తి స్థాయిలో బయటపడ్డాక ఆ ఆసుపత్రి వార్డులోనే తన భర్తతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
❤️🇺🇦 Very special lovestory.
— Verkhovna Rada of Ukraine - Ukrainian Parliament (@ua_parliament) May 2, 2022
A nurse from Lysychansk, who has lost both legs on a russian mine, got married in Lviv. On March 27, Victor and Oksana were coming back home, when a russian mine exploded. The man was not injured, but Oksana's both legs were torn off by the explosion. pic.twitter.com/X1AQNwKwyu
Comments
Please login to add a commentAdd a comment