జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ మందుపాతర విధ్వంసం సృష్టించింది. పేలుడు ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన జమ్ము కశ్మీర్ సాంబా జిల్లాలో ఏర్పాటుచేసిన మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉజాన్ బారా కు తీవ్ర గాయాలయ్యాయి.
ఉజాన్ బారా బృదం బోర్డర్ ఔట్ పోస్ట్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. గాయపడిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.