చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో వరుసగా జరుగుతున్న మందుపాతరల పేలుళ్లకు సాధారణ పౌరులూ బలవుతున్నారు. సుక్మా జిల్లాలో గురువారం మొర్లిగూడ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ చిన్నారి బలవ్వగా తాజాగా శుక్రవారం ఇదే జిల్లాలోని భెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోగల కొత్తచెరువు గ్రామం వద్ద జరిగిన పేలుడుకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
గోర్ఖా గ్రామం కోసీపారాకు చెందిన ముచ్చిక హిడ్‌మా (55) విప్పపూలు ఏరుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళుతున్న క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళకు గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలో వారం వ్యవధిలో మూడు మందుపాతరల పేలుళ్లకు ముగ్గురు బలి కావడంతో గ్రామీణులు రహదారులపై నడవాలంటేనే వణికిపోతున్నారు.
మావోయిస్టుల మందుపాతరకు మహిళ బలి
Published Fri, Mar 18 2016 7:51 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement