chintoor
-
చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు మండలాల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాలను కలిపి కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జూలై 27న వరదప్రాంతాల పరిశీలనకు చింతూరు మండలం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుయిగూరులో మాట్లాడారు. కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీఇచ్చారు. మాట ఇచ్చిందే తడవుగా ఆయన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియకు చకచకా చర్యలు చేపట్టారు. ► రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వరద ప్రాంతాల పర్యటనకు సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి వెనువెంటనే అమల్లోకి తెచ్చారు. ► సెప్టెంబరు ఏడున జరిగిన మంత్రివర్గ సమావేశంలో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. అనంతరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలపై నోటిఫికేషన్ జారీఅయింది. ఆ గడువు ముగియడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ► ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం పట్ల చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటివరకు పాడేరు, రంపచోడవరం రెండు రెవెన్యూ డివిజన్లు వుండగా, కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య మూడుకు పెరిగింది. ► కొత్తగా ఏర్పాటైన చింతూరు డివిజన్లో మొత్తం 1,35,082 మంది జనాభా వుండగా 90,929 మంది ఓటర్లున్నారు. వీరిలో 82,992 మంది ఎస్టీ జనాభా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. సర్వత్రా హర్షం మాట ఇస్తే నిలబెట్టుకోవడం తన నైజమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పేర్కొన్నారు. ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చింతూరు మండలం కుయిగూరు, చట్టిలో పర్యటించారు. రెవెన్యూ డివిజన్ ఎత్తివేయడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, పోలవరం భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలపై రంపచోడవరం వెళ్లాలంటే దూరాభారంగా మారిందని ఇక్కడి ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీనిచ్చారు. ఈ మేరకు హామీని నెరవేరుస్తూ చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం ప్రభుత్వం చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగనుంది. – నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్యే రంపచోడవరం ఇదీ చదవండి: అక్కా.. సాయం అందిందా? -
వరదల వేళ విషాదం
చింతూరు: మండలంలో వరదల వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి చెరువుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చింతూరుకు చెందిన ఎర్రమల్లి రాంబాబు, కల్యాణిల ఇల్లు ముంపునకు గురికావడంతో ఎర్రంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. కుమ్మూరుకు చెందిన కురుసం సత్యం, నాగమణిలు కూడా తమ గ్రామం వరద ముంపులో ఉండడంతో ఎర్రంపేటలోని నాగమణి తల్లి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో వీరి పిల్లలైన అక్షిత (8), కురసం దుర్గాభవాని (8)లు ఎర్రంపేటలోని ఎంఈవో కార్యాలయం వెనుక ఉన్న చెరువు వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఎంతసేపటికీ తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో చెరువు వద్ద గాలించడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన బాలికలు ఇద్దరూ 3వ తరగతి చదువుతున్నారు. సంఘటన స్థలాన్ని చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ యాదగిరి సందర్శించి వివరాలు సేకరించారు. -
రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
చింతూరు: ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 530 కిలోల గంజాయిని శనివారం చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ యాదగిరి తమ సిబ్బందితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోతుగూడెం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా గుమ్మడికాయల కింద దాచి రవాణా చేస్తున్న గంజాయి లభ్యమైంది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరవ్‌కుమార్, ప్రతాప్‌కుమార్, ఒడిశాకు చెందిన కొర్రా సన్యాసిరావు, కిలో అర్జున్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
హృదయ విదారక ఘటన: దారిలోనే 'పసి'వాడిన బతుకు
చింతూరు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో మృతిచెందగా ఆ మృతదేహాన్ని ఆటోడ్రైవర్ రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. నడిరోడ్డుపై ఆ చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు అల్లాడారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి దారిన పోయే ఆటోలను, వాహనాలను ఆపినా ఎవరూ కరుణ చూపలేదు. చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద బుధవారం జరిగిన హృదయ విదారక ఘటన వివరాలివి. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన సోడె సుబ్బారావు, బుచ్చమ్మల కొడుకు హరికృష్ణారెడ్డి(9) అంతుచిక్కని వ్యాధితో వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడిని చికిత్స నిమిత్తం చింతూరులోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా అనారోగ్యం తగ్గక పోవడంతో బుధవారం వీఆర్‌పురం మండలంలోని ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన నాటువైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు తిరిగి బాలుడిని ఆటోలో ఎక్కించుకుని స్వగ్రామం తీసుకెళుతుండగా చింతూరు మండలం ఏజీకొడేరు వద్దకు రాగానే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతిచెందాడు. దీంతో సదరు ఆటోడ్రైవర్ బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను అక్కడే బస్‌షెల్టర్ వద్ద రహదారిపై ఎండలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాలుడి మృతదేహంతో రహదారిపై రోదిస్తూనే మృతదేహాన్ని తరలించేందుకు అదే రహదారిలో వస్తున్న ఆటోలను ఆపేందుకు ప్రయత్నించగా ఎవరూ ఆపలేదని తల్లిదండ్రులు తెలిపారు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని పక్కనే వున్న బస్‌షెల్టర్‌లోకి తరలించి తల్లిదండ్రులను ఓదార్చారు. రెండు గంటలపాటు నిరీక్షణ అనంతరం సోడె జోగారావు అనే ఉపాధ్యాయుడు స్పందించి ఎట్టకేలకు ఓ ఆటోను ఆపి బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను వారి స్వగ్రామానికి తరలించారు. (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
చల్లకుండ
చింతూరు: ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతల్లో ఛత్తీస్‌గఢ్‌లో తయారైన చలువ కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ డిజైన్లలో ఎర్రగా కనిపించే ఈ కుండలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ప్రత్యేకమైన మట్టితో తయారయ్యే ఈ కుండల్లో పోసిన నీరు ఫ్రిజ్‌లో పెట్టిన మాదిరిగా ఉండడంతో వీటి కొనుగోళ్లుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మందంగా వుండే ఈ కుండలు ఎంతోకాలం మన్నడంతో పాటు నీటికి, వంటకు బాగా ఉపయోగ పడతాయని, అందుకే అధికశాతం వీటినే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. రూ .50 నుంచి రూ.700 వరకు ధర కలిగిన కుండలతో పాటు వివిధ రకాల బొమ్మలను కూడా సంతల్లో విక్రయిస్తున్నారు. ప్రత్యేక మట్టితో తయారీ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుకనార్‌లో ప్రత్యేకమైన మట్టితో ఈ కుండలను తయారు చేస్తామని తయారీదారుడు దసురాం తెలిపాడు. భూమి పైభాగంలో కేవలం రెండు అంగుళాల మేర లభించే ప్రత్యేకమైన మట్టిని ఈ కుండల తయారీకి వినియోగిస్తామని అతను తెలిపాడు. ఆ మట్టి జిగటగా ఉండడంతో పాటు గట్టిదనం కలిగి ఉంటుందని దీనివలన కుండలు అందంగా కనబడడంతో పాటు చాలాకాలం మన్నుతాయని తెలిపాడు. మట్టితో కుండలు తయారు చేసిన అనంతరం వాటికి ఎర్రరంగు అద్ది మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాడు. తమ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు కుండలు తయారు చేస్తున్నాయని, వాటిని ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్, సుక్మాతో పాటు ఆంధ్రా సరిహద్దుల్లోని సంతలు, తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం వంటి పట్టణాల్లో విక్రయిస్తామని అతను తెలిపాడు. -
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు టెంపో వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. భద్రాచలం నుంచి అన్నవరం బయలుదేరిన టెంపో(ఏపీ 16 టీడీ 6849) మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో వాలీ-సుగ్రీవుల కొండ వద్ద ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో సుమారు 20 అడుగుల పైనుంచి లోయలోకి పడిపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్నవారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని తూర్పుగోదావరి జిల్లా రూరల్ ఎస్పీని ఏలూరు రేంజ్ డీఐసీ ఏఎన్ ఖాన్ ఆదేశించారు. కర్ణాటకలోని చిత్రకూట్ దగ్గర చర్లకేళ్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు 24 మంది రెండు వాహనాల్లో బయలు దేరారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వస్తుండగా ఒక వాహనం ప్రమాదానికి గురైంది. మారేడుమిల్లి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా కారణంగానే దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఆరా మారేడుమిల్లి ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
తరువుకు బరువయ్యేలా..
పుడమితల్లి తన ప్రేమనంతా నింపినట్టు మధురాతిమధురంగా ఉండే పనస తొనల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ‘కొరుక్కు తినడానికి వీలైన తేనెముద్దలు’ అనొచ్చు. సాధారణంగా పనసచెట్టుకు నలభై నుంచి యాభై కాయలు కాస్తుంటాయి. చింతూరు మండలం సిరసనపల్లిలో కలుముల వెంకటేశ్వర్లు అనే గిరిజనుడికి చెందిన చెట్టుకు ఏకంగా 125 కాయలు కాశాయి. ఇది బురద పనస చెట్టని, దీని తొనలు పెద్దవిగా, ఎంతో తీయగా ఉంటాయని ఆయన తెలిపారు. గుత్తులు, గుత్తులుగా కాయలు కాసిన ఈ చెట్టు గ్రామస్తులకు కనువిందు చేస్తోంది. – చింతూరు -
200 కిలోల గంజాయి పట్టివేత
ఐదుగురి అరెస్ట్.. మూడు కార్లు సీజ్ చింతూరు (రంపచోడవరం) : రెండు వేర్వే రు కేసుల్లో ఏ జెన్సీ డొంకరా యి నుంచి మహా రాష్ట్ర కు గంజాయిని తరలిస్తున్న ఐ దుగురిని గురువారం అరెస్ట్ చేసిన ట్టు చింతూరు సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చింతూరు మండలం గొర్లగూడెం జంక్ష¯ŒS వద్ద తనిఖీలు చేస్తుంటే రెండు కార్లలో 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కా ర్లను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో మహారాష్ట్ర రాష్ట్రం ధూలే జి ల్లాకు చెందిన రమేష్‌పాటిల్, సంజ య్ భగవా¯ŒS చౌదరి, ప్రవీణ్ యువరాజ్ పాటిల్, దొండైచా జిల్లాకు చెం దిన దీపక్ తుకారంలను అరెస్ట్ చేశామన్నారు. మరో ఘటనలో ఇదే ప్రాం తంలో మరో కారులో తరలిస్తున్న 60 కిలోల గంజాయి లభ్యమైందన్నారు. గంజాయి రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రఘువీర్‌రాయ్‌ను అరెస్టు చేసి కారును సీజ్ చేశామన్నారు. స్వా« దీనం చేసుకున్న గంజాయి విలువ రూ.పది లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోçßæనరావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవరెస్టే లక్ష్యంగా..
చింతూరులో 16 మందికి శిక్షణ ఏప్రిల్, మేలలో ఆరోహణా యాత్ర చింతూరు : ఎవరెస్టు అధిరోహణే లక్ష్యంగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన 30 మందికి శిక్షణనిచ్చి డార్జిలింగ్‌లోని రెనాక్ పర్వతాధిరోహణ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన అనంతరం వారిలో 16 మంది ని ఎంపిక చేశామని, వారికి ఈనెల 2 నుంచి చింతూరులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పర్వతారోహణా శిక్షకుడు దూబి భద్రయ్య శనివారం తెలిపారు. నవంబరు 15 నుంచి డిసెంబరు 6 వరకు డార్జిలింగ్‌లో 30 మందికి శిక్షణనివ్వగా డిసెంబరు ఒకటిన రెనాక్ పర్వతాన్ని అధిరోహించారని చెప్పారు. వీరిలో ప్రతిభ కనబరచిన 13 జిల్లాలకు చెందిన 16 మందిని ఎంపిక చేశామని, వారిలో చింతూరు మండలం కుయిగూరుకు చెందిన సో యం సారమ్మ, వీఆర్‌పురానికి చెందిన కుంజా దుర్గారావు ఉన్నారని తెలిపారు. వా రందరినీ చింతూరులో శిక్షణ అనంతరం జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ పర్వతారోహణకు తీసుకెళతామన్నారు. లడఖ్ పర్వతారోహణలో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ను తట్టుకోవాల్సి ఉంటుందని, ఈ పరిస్థితులను త ట్టుకుని ప్రతిభ కనబరచిన వారి ని అసలు లక్ష్యమైన ఎవరెస్టు అధిరోహణకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎవరెస్టు అధిరోహ ణ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుందన్నారు. యువత ముందుకు రావాలి.. పర్వతారోహణకు మరింత మంది యువత ముందుకు రావాలి. లక్ష్యాలను అధిగమించినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏజెన్సీలో గిరిజన యువతను ప్రోత్సహించేందుకు నా వంతు కృషి చేస్తా. –దూబి భద్రయ్య, పర్వతారోహక శిక్షకుడు -
ప్రకృతితో ముడిపడిన కోయభాష
అంతర్రాష్ట్ర కోయ బాలసాహిత్య సమ్మేళనంలో ఆదివాసీ కవులు చింతూరు : ఆదివాసీలు మాట్లాడే కోయభాషలో ఎంతో గొప్పదనం ఉందని, ఈ భాషలోని పదాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని పలువురు అదివాసీ కవులు అన్నారు. కోయత్తోర్ బాట, కోయ సమాజ్‌ల ఆధ్వర్యాన చింతూరు మండలం రామన్నపాలెంలో మూడు రోజుల అంతర్రాష్ట్ర కోయ బాల సాహిత్య సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ కవులు మాట్లాడుతూ, కోయ భాషను బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో కోయ బాల సాహిత్యాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మధ్య గోండ్వానా ప్రాంతమంతా కోయజాతి నిండి ఉందని, మాతృభాష ప్రాధాన్యాన్ని వీరికి తెలియజేయాల్సి ఉందని అన్నారు. ఆదివాసీలు నివసించే ఆరు రాష్ట్రాల్లో కోయ బాల సాహిత్యం ప్రవేశపెడితే ప్రాథమిక దశలోనే ఆదివాసీ పిల్లలకు మాతృభాష ఔన్నత్యం తెలుస్తుందన్నారు. త్వరలో జాతీయ స్థాయిలో సైతం ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువ రచయితలు కోయభాషలో రచించిన పద్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అఖిల భారత గోండ్వానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సిడాం అర్జూ, ఆదివాసీ రచయితల సంఘం కార్యదర్శి మైపతి అరుణ్‌కుమార్, కట్టం సత్యం, పద్దం అనసూయ, యాదయ్య, మురళి, భీమమ్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ మృతి
చింతూరు :ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం కొండగావ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు జన్ మిలీషియా కమాండర్ సుధ్‌రాం మృతి చెందాడు. మర్దాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల సంచారం ఉందనే సమాచారం మేరకు కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలు తిరిగి వస్తున్నాయి. ఆ క్రమంలో అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో కుదూర్ ఏరియా జన్ మిలీషియా కమాండర్ సుధ్‌రాం అలియాస్ సుఖ్రాం కశ్యప్ మృతదేహం, ఓ తుపాకీ, పేలుడు సామగ్రి లభ్యమైనట్లు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జిన్నారంలో శుక్రవారం అరెస్టు చేసినట్లు ఐజీ తెలిపారు. అరెస్టయిన మావోయిస్టులంతా సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందినవారని, వీరంతా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఐజీ తెలిపారు. -
మావోయిస్టుల మందుపాతరకు మహిళ బలి
చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో వరుసగా జరుగుతున్న మందుపాతరల పేలుళ్లకు సాధారణ పౌరులూ బలవుతున్నారు. సుక్మా జిల్లాలో గురువారం మొర్లిగూడ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ చిన్నారి బలవ్వగా తాజాగా శుక్రవారం ఇదే జిల్లాలోని భెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోగల కొత్తచెరువు గ్రామం వద్ద జరిగిన పేలుడుకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గోర్ఖా గ్రామం కోసీపారాకు చెందిన ముచ్చిక హిడ్మా (55) విప్పపూలు ఏరుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళుతున్న క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళకు గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలో వారం వ్యవధిలో మూడు మందుపాతరల పేలుళ్లకు ముగ్గురు బలి కావడంతో గ్రామీణులు రహదారులపై నడవాలంటేనే వణికిపోతున్నారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
చింతూరు (తూర్పు గోదావరి జిల్లా) : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మిసిగూడ గ్రామం వద్ద తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం, రెండు తుపాకులు, పేలుడు సామగ్రి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. -
పిల్లలకు విషమిచ్చి..తల్లి ఆత్మహత్యాయత్నం
* ఓ బాబు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం చింతూరు: ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా చింతూరు మండలం నర్శింగపేటలో సోమవారం వెలుగుచూసింది. ఈ ఘటనలో ఓ బిడ్డ మృతి చెందగా, తల్లీ మరో బిడ్డ ఆస్పత్రిలో ఉన్నారు. చింతూరుకు చెందిన షేక్ హుస్సేన్, మిన్నూ దంపతులు నర్శింగపేటలో సైకిల్ రిపేరు షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి అన్వర్(7), అబ్బీ(4), మున్వర్(2) ఉన్నారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. సోమవారం హుస్సేన్ బయటకు వెళ్లగానే టీలో గుళికలు కలిపి అన్వర్, మున్వర్‌కు తాగించి మిన్నూ తాగింది. కాసేపటి తర్వాత భర్త వచ్చి చూసేసరికి ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రిలో మున్వర్ మృతిచెందాడు. మిన్నూ, అన్వర్ల పరిస్థితి విషమంగా ఉంది.