* ఓ బాబు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
చింతూరు: ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా చింతూరు మండలం నర్శింగపేటలో సోమవారం వెలుగుచూసింది. ఈ ఘటనలో ఓ బిడ్డ మృతి చెందగా, తల్లీ మరో బిడ్డ ఆస్పత్రిలో ఉన్నారు. చింతూరుకు చెందిన షేక్ హుస్సేన్, మిన్నూ దంపతులు నర్శింగపేటలో సైకిల్ రిపేరు షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి అన్వర్(7), అబ్బీ(4), మున్వర్(2) ఉన్నారు.
ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. సోమవారం హుస్సేన్ బయటకు వెళ్లగానే టీలో గుళికలు కలిపి అన్వర్, మున్వర్‌కు తాగించి మిన్నూ తాగింది. కాసేపటి తర్వాత భర్త వచ్చి చూసేసరికి ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రిలో మున్వర్ మృతిచెందాడు. మిన్నూ, అన్వర్‌ల పరిస్థితి విషమంగా ఉంది.
పిల్లలకు విషమిచ్చి..తల్లి ఆత్మహత్యాయత్నం
Published Tue, Nov 25 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement