
సాక్షి, ఖమ్మం: రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన భార్య,భర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే..
గత శనివారం.. భార్య, భర్తలు వడ్య బాబురావు, రంగమ్మ పురుగులు మందు తాగి, ఇద్దరు పిల్లలకు కూడా కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. దీంతో వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం భార్య,భర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు హనిస్వి, మహని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
(చదవండి: ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం)
Comments
Please login to add a commentAdd a comment