సిట్టింగ్ వాలీబాల్!
కొలంబియా: వాలీబాల్ క్రీడను సాధారణంగా నించుని ఆడతారు. కానీ ప్రత్యేక కారణంతో కొలంబియాలో కూర్చుని వాలీబాల్ ఆడుతున్నారు. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నవారందరూ కొంబోడియాలో మందుపాతర పేలుళ్ల కారణంగా కాళ్లు, చేతులు కోల్పోయిన సైనికులు, పౌరులు. బుధవారం బెలో మున్సిపాలిటీ నిర్వహించిన సిట్టింగ్ వాలీబాల్ నేషనల్ చాంపియన్ షిప్ లో వీరు పాల్గొన్నారు.
తమకు కాళ్లు, చేతులు లేనప్పటికీ ఉత్సాహంగా వీరు వాలీబాల్ ఆడారు. రెండు కాళ్లు లేనివారు, ఒక కాలు, ఒక చేయి మాత్రమే ఉన్నవారు ఇందులో పాల్గొన్నారు. మందుపాతరలు తమను వికలాంగులుగా మార్చినా తమ సంకల్పం చెక్కుచెదరలేదని వీళ్లు నిరూపించారు. మందుపాతరలు అధికంగా దేశాల్లో కంబోడియా ఒకటి. ల్యాండ్ మైన్స్ పేలుళ్లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వానికి, ఎఫ్ఏఆర్సీ గెరిల్లాలకు మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మరికొన్ని వారాల్లో అమల్లోకి రానుంది. దీంతోనైనా మందుపాతర్లకు పాతర వేస్తారేమో చూడాలి.