sitting volleyball
-
Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో..
టోక్యో: సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టరు. అలాంటిది 35 ఏళ్ల లోరా వెబ్‌స్టర్(అమెరికా) 5 నెలల గర్భంతో విశ్వవేదికపై(సిట్టింగ్ వాలీబాల్) దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐదో పతకం వేటలో చురుగ్గా పాల్గొంటుంది. ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు పోటీల్లో పాల్గొనడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ఓసారి పారాలింపిక్స్‌లో, మరోసారి ఓ అంతర్జాతీయ వేదికపై గర్భంతోనే పోటీల్లో పాల్గొంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన లోరా.. నాలుగో బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, లోరా ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఇవాళ బ్రెజిల్‌తో సెమీస్ పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్ నెగ్గితే లోరా ఖాతాలో 5వ పతకం చేరడం ఖాయం. లోరా తొలిసారి ఏథెన్స్లో కాంస్య పతకం సాధించింది. ఆతర్వాత 2008, 2012 పారాలింపిక్స్‌లో రజతాలు గెలుచుకుంది. గత రియో పారాలింపిక్స్‌లో ఈ అమెరికన్ ధీర వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఏకంగా స్వర్ణం నెగ్గింది. కాగా, లోరాకు 11 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్ కారణంగా ఎడమ కాలు దెబ్బతింది. చదవండి: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం -
సిట్టింగ్ వాలీబాల్!
కొలంబియా: వాలీబాల్ క్రీడను సాధారణంగా నించుని ఆడతారు. కానీ ప్రత్యేక కారణంతో కొలంబియాలో కూర్చుని వాలీబాల్ ఆడుతున్నారు. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నవారందరూ కొంబోడియాలో మందుపాతర పేలుళ్ల కారణంగా కాళ్లు, చేతులు కోల్పోయిన సైనికులు, పౌరులు. బుధవారం బెలో మున్సిపాలిటీ నిర్వహించిన సిట్టింగ్ వాలీబాల్ నేషనల్ చాంపియన్ షిప్ లో వీరు పాల్గొన్నారు. తమకు కాళ్లు, చేతులు లేనప్పటికీ ఉత్సాహంగా వీరు వాలీబాల్ ఆడారు. రెండు కాళ్లు లేనివారు, ఒక కాలు, ఒక చేయి మాత్రమే ఉన్నవారు ఇందులో పాల్గొన్నారు. మందుపాతరలు తమను వికలాంగులుగా మార్చినా తమ సంకల్పం చెక్కుచెదరలేదని వీళ్లు నిరూపించారు. మందుపాతరలు అధికంగా దేశాల్లో కంబోడియా ఒకటి. ల్యాండ్ మైన్స్ పేలుళ్లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వానికి, ఎఫ్ఏఆర్సీ గెరిల్లాలకు మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మరికొన్ని వారాల్లో అమల్లోకి రానుంది. దీంతోనైనా మందుపాతర్లకు పాతర వేస్తారేమో చూడాలి.