Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో..  | Lora Webster: 5 Months Pregnant Women Take part In Tokyo Olympics | Sakshi
Sakshi News home page

Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో.. 

Published Fri, Sep 3 2021 12:34 PM | Last Updated on Fri, Sep 3 2021 12:34 PM

Lora Webster: 5 Months Pregnant Women Take part In Tokyo Olympics - Sakshi

టోక్యో: సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టరు. అలాంటిది 35 ఏళ్ల లోరా వెబ్‌స్టర్‌(అమెరికా) 5 నెలల గర్భంతో విశ్వవేదికపై(సిట్టింగ్‌ వాలీబాల్‌) దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐదో పతకం వేటలో చురుగ్గా పాల్గొంటుంది. ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు పోటీల్లో పాల్గొనడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ఓసారి పారాలింపిక్స్‌లో, మరోసారి ఓ అంతర్జాతీయ వేదికపై గర్భంతోనే పోటీల్లో పాల్గొంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన లోరా.. నాలుగో బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. 

ఇదిలా ఉంటే, లోరా ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఇవాళ బ్రెజిల్‌తో సెమీస్‌ పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్‌ నెగ్గితే లోరా ఖాతాలో 5వ పతకం చేరడం ఖాయం. లోరా తొలిసారి ఏథెన్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఆతర్వాత 2008, 2012 పారాలింపిక్స్‌లో రజతాలు గెలుచుకుంది. గత రియో పారాలింపిక్స్‌లో ఈ అమెరికన్‌ ధీర వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఏకంగా స్వర్ణం నెగ్గింది. కాగా, లోరాకు 11 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్‌ కారణంగా ఎడమ కాలు దెబ్బతింది.
చదవండి: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement