వాషింగ్టన్:తన మాట వినని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా ఝలిపించారు. త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఆదివారం(జనవరి26) ఒక పోస్టు చేశారు. ‘కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడు.ఇందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. కొలంబియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఇది వారంలో 50 శాతానికి పెరుగుతుంది.
కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్ బ్యాన్. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయి’అని ట్రంప్ వెల్లడించారు. కాగా, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
తమ దేశానికి చెందిన వారికి గౌరవమిస్తూ పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. గత వారం కూడా మెక్సికో కూడా కొలంబియా తరహాలోనే ట్రంప్ వలసదారులతో పంపిన మిలిటరీ విమానాలను తిప్పి పంపడం గమనార్హం.
ఇదీ చదవండి: పద్ధతిగా వస్తేనే ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment