ఎల్‌ఓసీ వద్ద పేలిన ల్యాండ్‌మైన్‌.. ఆర్మీ జవాన్‌ మృతి | Soldier Dies After Stepping On Old Landmine Near Line Of Control | Sakshi
Sakshi News home page

LoC in J&K: జమ్మూకశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్‌.. ఆర్మీ జవాన్‌ మృతి

Published Thu, Jan 18 2024 3:04 PM | Last Updated on Thu, Jan 18 2024 3:13 PM

Soldier Dies After Stepping On Old Landmine Near Line Of Control - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ల్యాండ్‌మైన్‌పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించి భారత ఆర్మీ జవాను ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. 

రాజౌరీ జిల్లా నౌషేరాలో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు పెట్రోలింగ్‌లో ఉండగా ఒక జవాను ల్యాండ్‌మైన్‌పై అడుగు పెట్టడంతో ప్రమాదవశాత్తూ అది ట్రిగ్గర్‌ అయ్యింది. దీంతో పేలుడు సంభవించండో ముగ్గురు ఆర్మీ జవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే వీరిని ఉధంపూర్‌లోని కమాండ్‌ ఆసుపత్రికి తరలించగా ఒ​క సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మరణించిన జవాన్‌ వివరాలను ఇంకా భారత ఆర్మీ వెల్లడించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement