army Jawan killed
-
ఎల్ఓసీ వద్ద పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ల్యాండ్‌మైన్‌పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించి భారత ఆర్మీ జవాను ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. రాజౌరీ జిల్లా నౌషేరాలో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు పెట్రోలింగ్‌లో ఉండగా ఒక జవాను ల్యాండ్‌మైన్‌పై అడుగు పెట్టడంతో ప్రమాదవశాత్తూ అది ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించండో ముగ్గురు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా ఒక సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మరణించిన జవాన్ వివరాలను ఇంకా భారత ఆర్మీ వెల్లడించలేదు. -
పంజాబ్‌లో ఆర్మీ జవాన్ మృతి.. ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
సాక్షి, నిజామాబాద్: జిల్లాకు చెందిన భారత ఆర్మీ జవాన్ పంజాబ్‌లో మృతి చెందాడు. మాక్లూర్ మండలం వెంకటాపురంకు చెందిన ఆర్మీ జవాన్ దాదన్నగారి కళ్యాణ్ రావు(25) ఆరేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో కళ్యాణరావు పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని పట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా చెట్టుపై నుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలు స్వగ్రామం వెంకటాపూరంలో శుక్రవారం జరగనున్నాయి. కాగా జవాను కళ్యాణ్ మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కళ్యాణ్ మరణం కలచివేసిందన్న ఎమ్మెల్సీ కవిత.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పందిస్తూ.. ‘నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సైనికుడు దాదన్నగారి కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరం. కళ్యాణ్ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సైనికుడు దాదన్నగారి కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరం. కళ్యాణ్ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/yRK4C0Mzy4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) June 17, 2021 చదవండి: అమెరికాలో ఉన్నా బతికేదానివి తల్లీ.. -
రైలు ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వేస్టేషన్ పరిధి చరణ్‌దాస్‌పురం లెవెల్ క్రాసింగ్‌కు సమీపంలో శుక్రవారం ఓ రైలు ఢీకొని ఆర్మీ జవాన్ పాలిన మోహనరావు(43) మృతి చెందారు. ఆయన ఆర్మీలో జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందటే సెలవుపై గ్రామానికి వచ్చారు. జీఆర్పీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని నందిగాం మండలం ప్రతాప విశ్వనాథపురం (షరాబు కొత్తూరు) గ్రామానికి చెందిన పాలిన ఎర్రయ్య, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు మోహనరావు ఆర్మీలో జేసీవో హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి ఆయన భార్య అరుణకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పూండి బస్టాండ్ రోడ్డులో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లారు. రైలు పట్టాలు దాటుతుండగా డౌన్‌లైన్‌లో నౌపడ నుంచి పలాస వైపు వస్తున్న ఓ సూపర్ ఫాస్ట్ రైలు ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. విషయాన్ని పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ ధ్రువీకరించారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు కార్తీక్, యశ్వంత్ ఉన్నారు. మోహనరావు రెండు దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. మృతుని స్వగ్రామం షరాబు కొత్తూరులో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వచ్చిన నాయక్ సుబేదార్ సంజయ్ ప్రకాష్, హవల్దార్ భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
పాముకాటుకు ఆర్మీ జవాన్ మృతి
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడేనికి చెందిన ఆర్టీ జవాన్ కూస కరుణాకర్ (23) జమ్మూకాశ్మీర్‌లో పాముకాటుకు గురై మృతి చెందాడు. కరుణాకర్ నాలుగేళ్ల క్రితం ఆర్మీ జవానుగా ఎంపికై జమ్ము-కాశ్మీర్‌లోని నక్రోటలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న విధులు ముగించుకుని నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. మరునాడు ఛాతీలో నొప్పి రాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు పాము కరిచినట్లు నిర్ధారించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 10న కరుణాకర్ మృతి చెందాడు. మృతదేహాన్ని అధికారులు స్వగ్రామానికి పంపించారు. కరుణాకర్ తన పుట్టినరోజైన మార్చి 10నే మరణించాడు.