
ఫైల్ ఫోటో
సాక్షి, నిజామాబాద్: జిల్లాకు చెందిన భారత ఆర్మీ జవాన్ పంజాబ్‌లో మృతి చెందాడు. మాక్లూర్ మండలం వెంకటాపురంకు చెందిన ఆర్మీ జవాన్ దాదన్నగారి కళ్యాణ్ రావు(25) ఆరేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో కళ్యాణరావు పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని పట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా చెట్టుపై నుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలు స్వగ్రామం వెంకటాపూరంలో శుక్రవారం జరగనున్నాయి.
కాగా జవాను కళ్యాణ్ మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కళ్యాణ్ మరణం కలచివేసిందన్న ఎమ్మెల్సీ కవిత.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సైనికుడు దాదన్నగారి కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరం. కళ్యాణ్ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సైనికుడు దాదన్నగారి కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరం. కళ్యాణ్ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/yRK4C0Mzy4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 17, 2021
Comments
Please login to add a commentAdd a comment