Mahira khan Reveals About Her Secret Husband In New Video- Sakshi
Sakshi News home page

Mahira Khan: రహస్య పెళ్లా? నేనా? వేలికి ఉంగరం కూడా లేదే!

Published Mon, Jul 12 2021 3:35 PM | Last Updated on Mon, Jul 12 2021 4:21 PM

Mahira khan Reveals About Her Secret Husband In New Video - Sakshi

సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలపై పాకిస్తాన్‌ నటి మహీరా ఖాన్‌ స్పందించింది. తాను రహస్య వివాహం చేసుకోలేదని స్పష్టం చేసింది. "నా చేతి వేళ్లకేమైనా ఉంగరం కనిపిస్తుందా? లేదు కదా, నేను పెళ్లి పీటలెక్కితే ఆ విషయాన్ని తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను. అయినా నేను మ్యారేజ్‌ చేసుకుంటే అది మీకు తెలీకుండా ఉంటుందా! ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా ఎప్పుడో దాన్ని మీకు షేర్‌ చేసేదాన్ని. కాబట్టి నేనిప్పుడు చెప్పొచ్చేదేంటంటే నాకు పెళ్లి కాలేదు. కనీసం నిశ్చితార్థం కూడా జరగలేదు" అని తన యూట్యూబ్‌ ఛానల్‌ మ్యాషన్‌లో ఓ  వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇచ్చింది.

కాగా 'హమ్‌సఫర్‌', 'షెహర్‌ ఇ జాత్‌', 'బిన్‌ రోయ్‌' వంటి టీవీ షోల ద్వారా మహీరా ఖాన్‌ హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 2017లో 'రేస్‌' సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం స్టార్‌ హీరో టామ్‌ క్రూయిజ్‌తో కలిసి హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. ఉరి ఉగ్రదాడుల తర్వాత ఈ పాకిస్తానీ నటి భారత్‌లో అడుగు పెట్టనేలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement