ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు తలెత్తుకు తిరగలేకపోయాను. ఎవరికీ సమాధానం చెప్పుకోలేకపోయాను. డిప్రెషన్‌కు లోనయ్యాను అంటోంది పాకిస్తాన్ హీరోయిన్ మహీరా ఖాన్. తాజాగా ఆమె మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడిన క్షణాల గురించి చెప్పుకొచ్చింది. 2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మహీరా. అదే సమయంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంతోమంది ఆమెను ఆన్‌లైన్‌లో దారుణంగా తిట్టిపోశారు.
నాపై దాడి చేసినట్లు..
అప్పటి పరిస్థితులను మహీరా గుర్తు చేసుకుంటూ.. 'నాపై వచ్చిన విమర్శలు చూసి నేను ఎంతో కలత చెందాను. తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. టీవీ ఛానల్స్, ట్వీట్స్, కామెంట్స్.. ఇలా ఎక్కడ చూసినా అందరూ తిడుతూనే ఉన్నారు. అది నేను భరించలేకపోయాను. పిచ్చిదాన్నయ్యాను. ఒకరోజైతే ఆందోళనతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. అందరూ కలిసి నాపై దాడి చేసినట్లు అనిపించింది. చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నించాను. కానీ అది వర్కవుట్ కాలేదు. చాలామంది డాక్టర్లను కలిశాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చేతులు కూడా వణికిపోయేవి' అని చెప్పుకొచ్చింది.
రాయిస్ సినిమా పూర్తయ్యాక ఉగ్రదాడి
2016లో జరిగిన ఉరి ఉగ్రదాడుల ఫలితంగా పాకిస్తాన్ నటులు ఇకమీదట బాలీవుడ్‌లో నటించడానికి వీల్లేదన్న షరతు అమల్లోకి వచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'అప్పటికే నేను రాయిస్ సినిమా పూర్తి చేశాను. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఉరి ఉగ్రదాడి జరిగింది. నాకు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని ఫోన్ కాల్స్ కూడా చేశారు. అప్పుడే రాయిస్ సినిమా ప్రమోషన్‌కు నేను వెళ్లలేనని అర్థమైంది. కానీ ఆ మూవీ పాక్‌లో కూడా రిలీజైతే బాగుండనుకున్నాను. ఎందుకంటే షారుక్ ఖాన్‌ను ప్రేమించేవారు ఇక్కడ కూడా ఉన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహీరా.. ఫర్హాత్ ఇష్తియాఖ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ ఆమాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్
Comments
Please login to add a commentAdd a comment