mahira khan
-
నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్
-
సూపర్ హిట్ మూవీ సీక్వెల్లో పాక్ నటి.. ఫోటో వైరల్!
ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్. ఆమె త్వరలోనే మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తోన్న ఎల్2: ఎంపురాన్‌లో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. మహీరా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనేపథ్యంలో పృథ్వీరాజ్‌తో ఉన్న మహీరా పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో విడుదలైన లూసిఫర్ పార్ట్-2గా ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. మహీరా ఖాన్ విషయానికొస్తే.. 2017 బాలీవుడ్ చిత్రం రయీస్‌లో షారుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. అయితే 2016 యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. దీంతో నిషేధం తర్వాత ఆమె ఇండియాలో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇటీవలే పాకిస్థానీ కళాకారులపై ఉన్న నిషేధాన్ని ముంబై హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మహీరా ఖాన్ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే. Is this an old photo?#PrithvirajSukumaran with #Mahirakhan pic.twitter.com/SvVMQG5MQD — AKV (@AnandKr13834547) November 26, 2023 View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) -
కోట్ల ఆస్తులు.. టాయిలెట్స్ శుభ్రం చేసిన షారుక్ హీరోయిన్!
బాలీవుడ్లో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే అలాగే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్‌సఫర్‌లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది. అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్‌లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్ఎంజిల్స్లో ఉన్న సమయంలో ఫ్లోర్లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్‌తో జతకట్టనుంది. -
రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు
పాకిస్తాన్ హీరోయిన్ మహీరా ఖాన్.. ఇండియాలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. రేయిస్ మూవీలో షారుక్ ఖాన్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ తర్వాత మరే భారతీయ చిత్రంలోనూ నటించలేదు. కానీ ఈ సినిమాతో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరోయిన్ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. మహీరా మేనేజర్ అనుషయ్ తల్హా ఖాన్ ఈ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహీరా తనవైపు నడుచుకుంటూ వస్తుండటంతో వరుడు ఎమోషనల్ అయ్యాడు. తనను దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టుకున్నాడు. ఆమెకు ప్రేమగా ముద్దుపెట్టి తనను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇక పెళ్లికూతురి గెటప్‌లో మహీరా మెరిసిపోయింది. పేస్టల్ లెహంగా ధరించిన వధువు దానికి మ్యాచింగ్‌గా వజ్రాభరణాలు ధరించింది. సలీమ్ బ్లాక్ షేర్వాణీ వేసుకోగా తలకు నీలిరంగు తలపాగా చుట్టుకున్నాడు. పాకిస్తాన్‌లోని ముర్రేలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మహీరా, సలీమ్ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గతేడాదే ఆమె అధికారికంగా వెల్లడించింది. ఇంత కాలానికి తమ ప్రేమను ముందుకు తీసుకువెళ్లి పెళ్లితో ఒక్కటయ్యారు. If he does not tear up looking at you as a bride, is it even worth it?🥹♥️#MahiraKhan #SalimKarim pic.twitter.com/MXgQEEmyL8 — Sania Yasin (@SaniaYasin4) October 2, 2023 AWWW MY HEART 🥹🤍#Mahirakhan pic.twitter.com/jEQv3gC96I — sadia (@sadiajeelani) October 1, 2023 చదవండి: ప్రతివారం ఆ పని చేయకపోతే మనసు ఊరుకోదంటున్న చంద్రముఖి 2 నటి -
హీరోతో కలిసి సిగరెట్ తాగిన పిక్స్.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: హీరోయిన్
ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు తలెత్తుకు తిరగలేకపోయాను. ఎవరికీ సమాధానం చెప్పుకోలేకపోయాను. డిప్రెషన్‌కు లోనయ్యాను అంటోంది పాకిస్తాన్ హీరోయిన్ మహీరా ఖాన్. తాజాగా ఆమె మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడిన క్షణాల గురించి చెప్పుకొచ్చింది. 2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మహీరా. అదే సమయంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంతోమంది ఆమెను ఆన్లైన్లో దారుణంగా తిట్టిపోశారు. నాపై దాడి చేసినట్లు.. అప్పటి పరిస్థితులను మహీరా గుర్తు చేసుకుంటూ.. 'నాపై వచ్చిన విమర్శలు చూసి నేను ఎంతో కలత చెందాను. తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. టీవీ ఛానల్స్, ట్వీట్స్, కామెంట్స్.. ఇలా ఎక్కడ చూసినా అందరూ తిడుతూనే ఉన్నారు. అది నేను భరించలేకపోయాను. పిచ్చిదాన్నయ్యాను. ఒకరోజైతే ఆందోళనతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. అందరూ కలిసి నాపై దాడి చేసినట్లు అనిపించింది. చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నించాను. కానీ అది వర్కవుట్ కాలేదు. చాలామంది డాక్టర్లను కలిశాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చేతులు కూడా వణికిపోయేవి' అని చెప్పుకొచ్చింది. రాయిస్ సినిమా పూర్తయ్యాక ఉగ్రదాడి 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడుల ఫలితంగా పాకిస్తాన్ నటులు ఇకమీదట బాలీవుడ్లో నటించడానికి వీల్లేదన్న షరతు అమల్లోకి వచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'అప్పటికే నేను రాయిస్ సినిమా పూర్తి చేశాను. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఉరి ఉగ్రదాడి జరిగింది. నాకు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని ఫోన్ కాల్స్ కూడా చేశారు. అప్పుడే రాయిస్ సినిమా ప్రమోషన్‌కు నేను వెళ్లలేనని అర్థమైంది. కానీ ఆ మూవీ పాక్‌లో కూడా రిలీజైతే బాగుండనుకున్నాను. ఎందుకంటే షారుక్ ఖాన్‌ను ప్రేమించేవారు ఇక్కడ కూడా ఉన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహీరా.. ఫర్హాత్ ఇష్తియాఖ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ ఆమాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్ -
'పాకిస్తానీ బిచ్చగత్తె' కామెంట్‌పై హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్!
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లు వేసుకున్న డ్రెస్, సినిమాలు, వ్యవహారశైలి, కామెంట్స్ ఏవి నచ్చకపోయినా సరే నెటిజన్లు విమర్శించడం పరిపాటిగా మారింది. చాలామంది సెలబ్రిటీలు ఈ ట్రోలింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తారు కానీ కొందరు మాత్రం ఘాటుగానే రియాక్ట్ అవుతారు. తాజాగా పాకిస్తాన్ నటి మహీరా ఖాన్‌ను ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించాడు. 'పాకిస్తానీ బిచ్చగత్తె.. ముందు నీ దేశం మీద ఫోకస్ పెట్టు' అని కామెంట్ చేశాడు. ఇది చూసిన మహీరా.. 'నువ్వేంటి మరి నా మీద దృష్టి పెడుతున్నావ్' అని కౌంటరిచ్చి అతడి నోరు మూయించింది. తర్వాత ఈ ట్వీట్లను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇక మరో నెటిజన్.. 'మహీరాగారు.. ప్లీజ్ ఒక్కసారి మీకు ప్రపోజ్ చేయవచ్చా?' అని అడిగాడు. దీనికామె ఎవరు వద్దంటున్నారు, చేసేయ్ అని బదులిచ్చింది. కాగా మహీరా 2017లో రయూస్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటించింది. ఆ తర్వాత భారత్‌లో పాకిస్తాన్ నటులపై నిషేధం విధించడంతో ఆమె ఇక్కడ మరే సినిమాలోనూ నటించలేదు. -
రహస్య పెళ్లిపై స్పందించిన పాకిస్తాన్ నటి
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలపై పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ స్పందించింది. తాను రహస్య వివాహం చేసుకోలేదని స్పష్టం చేసింది. "నా చేతి వేళ్లకేమైనా ఉంగరం కనిపిస్తుందా? లేదు కదా, నేను పెళ్లి పీటలెక్కితే ఆ విషయాన్ని తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను. అయినా నేను మ్యారేజ్ చేసుకుంటే అది మీకు తెలీకుండా ఉంటుందా! ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఎప్పుడో దాన్ని మీకు షేర్ చేసేదాన్ని. కాబట్టి నేనిప్పుడు చెప్పొచ్చేదేంటంటే నాకు పెళ్లి కాలేదు. కనీసం నిశ్చితార్థం కూడా జరగలేదు" అని తన యూట్యూబ్ ఛానల్ మ్యాషన్లో ఓ వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. కాగా 'హమ్‌సఫర్', 'షెహర్ ఇ జాత్', 'బిన్ రోయ్' వంటి టీవీ షోల ద్వారా మహీరా ఖాన్ హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 2017లో 'రేస్' సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం స్టార్ హీరో టామ్ క్రూయిజ్‌తో కలిసి హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఉరి ఉగ్రదాడుల తర్వాత ఈ పాకిస్తానీ నటి భారత్‌లో అడుగు పెట్టనేలేదు. -
ఆమె హీరోయిన్గా పనికి రాదు
-
‘ఆమె హీరోయిన్గా పనికి రాదు’
‘మహీర ఖాన్ వయసైపోయింది, హీరోయిన్గా పనికి రాదు’ అంటూ పాకిస్తాన్ ప్రముఖ నటుడు ఫిర్దోస్ జమాల్ ఓ టెలివిజన్ షోలో చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. జమాల్ వ్యాఖ్యలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ ద్వారా సమాధానమిచ్చారు. స్త్రీల పట్ల ద్వేషం మానుకోవాలని ఫిర్దోస్‌కు హితవు పలికారు. మహీర రాసిన ఈ లేఖకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ప్రముఖ నటుడు ఫిర్దోస్ జమాల్, రయూస్ నటి మహీర ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మహీర ఓ మామూలు మోడల్. వృద్ధ నటి. కేవలం తల్లి పాత్రలకు మాత్రమే సరిపోతుంది’ అని ఇటీవల ఓ టీవీ షోలో వ్యాఖ్యానించారు. ఫైజల్ ఖురేషీ నిర్వహించిన పాకిస్తాని షో ‘సలామ్ జిందగీ’లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి మహీర ఖాన్ తనదైన రీతిలో విమర్శలను తిప్పి కొట్టారు. తన లేఖలో ఎవరి పేరును ప్రస్తావించక పోయినప్పటికి, పరోక్షంగా నటుడు జమాల్ వ్యాఖ్యలను ఉద్దేశించి రాసినట్లుగా స్పష్టమవుతుంది. ‘మనం వర్తమానంలో ఉన్నాము. మనం ఏమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నామనేది మన భవిష్యత్తు. నేను అడగకపోయినా.. నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఒక ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమను, నన్ను చూసి నేను గర్వపడుతాను. నా ఈ ప్రయాణంలో నేను ఏదైతే సరైనది అనుకున్నానో అదే చేశాను. ఇతరుల ఆలోచనలకు ఎప్పుడూ లొంగలేదు, లొంగను కూడా’ అని తన భావాలను వ్యక్తపరిచారు. అంతేకాకుండా ‘ద్వేషంతో నిండిన ప్రపంచంలో, ప్రేమను పంచుదాం. ఇతరుల అభిప్రాయాలను గౌరవిద్దాం. వ్యతిరేకులపై సహనంతో పోరాడుదాం. మనలాంటి చిత్ర పరిశ్రమ, దేశం మరొకటి లేదనే విధంగా అభివృద్ధి చెందడానికి ఒకరినొకరం నిందించుకోవడం మానేద్దాం’ అన్నారు. నేను ఎక్కడో చదివాను లాటిన్ భాషలో ‘స్టార్డమ్’ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వెంట నిలిచే అభిమానులకు ధన్యవాదాలని అర్థం అని చెబుతూ తన లేఖను మహీరా ముగించారు. View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) on Jul 29, 2019 at 5:00am PDT -
వైరల్‌గా మారిన నటి స్మోకింగ్ వీడియో
-
నటి స్మోకింగ్ వీడియో వైరల్
పాకిస్తానీ నటి మహీరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. షారుఖ్ ఖాన్ ‘రయిస్’ సినిమాతో ఆమె బాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. మహీరా ఒక పార్టీలో దమ్ముకొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ ఘటనపై కొందరు ఆమె పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే, మరి కొందరు మాత్రం మహీరాకు మద్దతుగా నిలిచారు. మగవారు తాగితే తప్పులేదు కానీ, మేం తాగితే తప్పేంటి?, మేం తాగడం తప్పైతే మీరు తాగడమూ తప్పే, తన వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? తన ఇష్టం తనది అంటూ పలువురు మహిళలు ఆమెకు బాసటగా నిలిచారు. గతంలో కూడా మహిరా ఖాన్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లండన్‌లో హీరో రణవీర్ కపూర్‌తో కలిసి మహీరా స్మోక్ చేయటంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఓ వైపు ఆమె స్మోక్ చేయడాన్ని పలువురు తప్పుబడితే... పాకిస్తానీలు మాత్రం రణబీర్‌తో కలిసి స్మోక్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
నటికి వార్నింగ్.. ఇక్కడ ఇంతే వెళ్లిపో!
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి మహీరా ఖాన్‌కు సొంత దేశం పాక్‌లోనూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇష్టం లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెకు పలువురు సలహా ఇస్తున్నారు. అందుకు కారణం తన తాజా చిత్రం వెర్నా పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన ఓ పోస్టు. సినిమా ప్రారంభంలో ప్రదర్శించే డిస్‌క్లెయిమర్(అంతా కల్పితం.. తాము బాధ్యులము కాదంటూ ప్రదర్శించటం) ను పోస్ట్ చేసిన మహీరా ‘‘ఈ చిత్రంలో ప్రతీది కల్పితమే. అంటే నిజాన్ని నిగ్గుగా చెప్పలేక పోవటమే. ఈ చిత్రంలోని సన్నివేశాలు కూడా ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల మాదిరిగానే హస్యాస్పదంగా ఉన్నాయి’’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి కొందరు ఘాటుగా స్పందించారు. ఈ దేశంలో నిబంధనలు ఇలాగే ఉంటాయి. ఇతర దేశాల్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులే ఉన్నాయ్. ఇష్టంలేకపోతే పాక్‌ను విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు. మరికొందరు ఇంకోసారి ఇలాంటివి పోస్ట్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాగా, గవర్నర్ కొడుకు ఓ యువతిని అత్యాచారం చేయటం అన్న నేపథ్యంతో వెర్నా చిత్రం రూపుదిద్దుకోగా.. అందులో న్యాయపోరాటం చేసే బాధితురాలిగా మహీరా నటించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి చిక్కులు ఎదురుకావటంతో వివాదాస్పదంగా కాగా.. చివరకు అభ్యంతరకర సన్నివేశాల తొలగింపు మేరకు చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేయటంతో విడుదల అయ్యింది. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో వెర్నా అక్కడ ప్రదర్శితమౌతోంది. The disclaimer before #verna starts 🎬 A post shared by Mahira Khan (@mahirahkhan) on Nov 23, 2017 at 3:49am PST -
తొలిసారి మౌనం వీడారు!
పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ తొలిసారి మౌనం వీడారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి తాను సిగరెట్ తాగుతున్న ఫొటోలపై ఆమె స్పందించారు. న్యూయార్క్‌లో వీరిద్దరు కలిసి సిగరెట్ తాగుతున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏదో కొనసాగుతున్నదని, వీరి మధ్య ఎఫైర్ ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ ఫోటోల్లో మహిరా ఖాన్ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో కనిపించడంతో ఆమెపై పాక్ నెటిజన్లు విరుచుకుపడ్డారు. తాజాగా తన తాజా సినిమా 'వెర్నా' ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహిరా ఖాన్.. ఈ ఫొటోల గురించి ప్రశ్నించగా.. 'నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. ప్రజలు వద్దని చెప్తే.. సినిమాల్లో వారికి అభీష్టానికి భిన్నంగా చేయను. అలాంటిది ప్రపంచానికి చూపించేలా నేను ఎందుకు చేస్తాను' అని ఆమె పేర్కొన్నారు. రణ్‌బీర్‌ను కలుసుకోవడంపై స్పందిస్తూ.. 'అది నా వ్యక్తిగత జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి బయటకు కలిసి వెళ్లడం సర్వసాధారణం' అని బదులిచ్చారు. ఈ ఘటన నుంచి తాను గుణపాఠం నేర్చుకున్నట్టు చెప్పారు. 'ప్రస్తుతం మీడియా ఈవెంట్లలోనే కాదు ప్రతిచోటా ఉంటోంది. కాబట్టి దీని నుంచి నేను నేర్చుకున్నాను' అని మహిరా చెప్పింది. సిగరెట్ ఫొటోల వివాదంలో ఇప్పటికే రణ్‌బీర్ మహిరాకు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో స్పందిస్తూ.. 'మహిరా నాకు గత కొంత కాలంగా తెలుసు. ఒక వ్యక్తిగా కంటే ఆమె సాధించిన విజయాలకు ఆకర్షితుడనై నేను ఆమెకు అభిమానిగా మారిపోయా. కానీ, ఆమె ఫోటోపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఫోటో ఆధారంగా ఆమెను చులకనగా చేసి కామెంట్లు చేశారు. అది మంచి పద్ధతి కాదు. ముందు ఆ నెగటివ్ ఆలోచనలు మానుకుని దేవుడిచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా.. సంతోషంగా గడపండి’ అంటూ రణ్ వీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. పైగా సిగరెట్ తాగడమే కాదు.. ఇలా అసహ్యించుకోవటం కూడా ఆరోగ్యానికి హానికరమేనంటూ ఓ కొటేషన్ కూడా ఉంచాడు. -
అసహ్యించుకోవటం కూడా హానికరమే!
సాక్షి, సినిమా : యువ హీరో రణ్‌బీర్ కపూర్ - పాకిస్థాన్ హీరోయిన్ మహిరా ఖాన్.. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ గత కొంత కాలంగా బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అప్పట్లో ఓ ఈవెంట్‌కు లండన్ వెళ్లిన వీరిద్దరి మధ్య జరిగిన ఓ వీడియో బయటకు రావటం.. అందులో మహిరా ఏడుస్తూ రణ్‌బీర్‌ను ఏదో బతిమిలాడటం.. పెద్ద రచ్చే చేసింది. ఇప్పుడు అది చాలదన్నట్లు వీరిద్దరూ కలిసి సిగరెట్లు తాగుతున్న ఓ ఫోటో ఈ మధ్య వైరల్ అయ్యింది. దీంతో మహిరాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేశారు. ఒకానోక టైంలో కొందరు మహిరాను ఉద్దేశించి ‘ముస్లిం అమ్మాయివి అయ్యి ఉండి సిగ్గులేకుండా ఆ బట్టలు.. చేతిలో సిగరెట్ ఏంటి’’ అంటూ మతపరమైన విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ఓ ప్రకటన వెలువరించాడు. ‘మహిరా నాకు గత కొంత కాలంగా తెలుసు. ఒక వ్యక్తిగా కంటే ఆమె సాధించిన విజయాలకు ఆకర్షితుడనై నేను ఆమెకు అభిమానిగా మారిపోయా. కానీ, ఆమె ఫోటోపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఫోటో ఆధారంగా ఆమెను చులకనగా చేసి కామెంట్లు చేశారు. అది మంచి పద్ధతి కాదు. ముందు ఆ నెగటివ్ ఆలోచనలు మానుకుని దేవుడిచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా.. సంతోషంగా గడపండి’ అంటూ రణ్ వీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. పైగా సిగరెట్ తాగడమే కాదు.. ఇలా అసహ్యించుకోవటం కూడా ఆరోగ్యానికి హానికరమేనంటూ ఓ కొటేషన్ కూడా ఉంచాడు. మరోవైపు సీనియర్ నటుడు.. రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్, నటి పరిణితి చోప్రా, హీరో వరుణ్ ధావన్.. పాక్ నటుడు అలీ జఫర్ మహిరాకు సోషల్ మీడియాలో మద్ధతు తెలిపారు. -
రణ్‌బీర్‌తో కలిసి సిగరెట్ తాగిన భామ!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, పాకిస్థాన్ హాట్‌భామ మహిరా ఖాన్ డేటింగ్ చేస్తున్నారనే వదంతులు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత మార్చ్ నెలలో దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ టీచర్ ప్రైజ్ వేడుకలో ఈ ఇద్దరూ కలిసి పాల్గొనడం.. ఆ సమయంలో వేదిక వెనుక ఇద్దరు మాట్లాడుతూ కెమెరా కంటికి చిక్కడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా న్యూయార్క్‌లో విహరిస్తున్న ఈ ఇద్దరి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఈ ఇద్దరు సిగరెట్ తాగుతున్న ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో కనిపించడంతో వైరల్‌గా మారిపోయాయి. మహిరా ఖాన్ తాజాగా షారుఖ్ ఖాన్ సరసన 'రాయిస్' సినిమాలో అలరించిన సంగతి తెలిసిందే. బ్యాక్‌లెస్ వైట్ డ్రైస్ ధరించిన మహిరా న్యూయార్క్ స్ట్రీట్‌లో రణ్‌బీర్‌తో కలిసి చక్కర్లు కొడుతూ ఫొటోగ్రాఫర్ల కంటపడింది. ఈ ఇద్దరు సిగరెట్ దమ్ము లాగిస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. వీరు డేటింగ్ చేస్తున్నారన్న కథనాలను గతంలో మహిరా, రణ్‌బీర్ ఖండించారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్టు రణ్‌బీర్ చెప్తుండగా.. ఈ ఫొటోలకు స్పందనగా.. 'ఫస్ట్ ఆఫ్ ఆల్ నో.. సెకండాఫ్ నో' అంటూ సంక్షిప్త సమాధానాన్ని మహిరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని కామెంట్లు వినబడుతున్నాయి. -
రణ్‌బీర్‌తో నటి వైరల్ వీడియో హల్చల్
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్, నటి మహీరా ఖాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారి మధ్య చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయ్యి ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దుబాయ్‌లోని ఓ కార్యక్రమంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. తొలుత ఈ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు ఏం చక్కా నవ్వులు చిందిస్తూ రెడ్ కార్పెట్‌లో నడుస్తూ అతిథుల మధ్యకు వెళ్లారు. అందరినీ సరదాగా పలుకరించారు. ఫొటోలకు పోజులిచ్చారు. అయితే, ఆ తర్వాతే వారిమధ్య ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఓ తలుపువద్ద రణ్‌బీర్ నిల్చుని చూస్తుండగా అతడిని ఏదో బతిమిలాడుతున్నట్లుగా మహీరా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నట్లు కనిపించింది. ఆ సమయంలో రణ్‌బీర్ కాస్తంత అసహనంతో చిరాకుతో ఉన్నాడు. ఆమెను ఏదో సముదాయిస్తున్నట్లుగా కనిపించాడు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఆ వీడియో ఇప్పుడు బయటకు రాగా అది ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
షారుక్ గురించి చాలా ఊహించా గానీ..
షారుక్ ఖాన్ పేరు వింటే చాలు.. హీరోయిన్లు ఫిదా అవుతారు. ఆయనతో నటించే చాన్సు ఒక్కసారి వస్తే చాలనుకుంటారు. పాకిస్థానీ నటి మాహిరా ఖాన్ కూడా అలాగే భావించింది. రయీస్ సినిమాలో షారుక్ సరసన నటించిన మాహిరా.. ఫొటో షూట్ విషయంలో అతడి గురించి చాలా ఊహించాను గానీ, కాస్త అప్సెట్ అయ్యానని చెప్పింది. రయీస్ సినిమాకు తాను సంతకం చేసిన తర్వాత, ఫొటో షూట్ ఉంటుందని చెప్పారని, షారుక్ కూడా వస్తున్నారన్నారని, దాంతో తాను వెంటనే అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్తే.. ఆయన కేవలం హాయ్.. హలోతోనే సరిపెట్టేశారని మాహిరా తెలిపింది. కొంతసేపటి తర్వాత అక్కడ గాలి వీస్తుందని, చుట్టూ ఆకులు రాలతాయని.. ఇలా చాలా చాలా ఊహించాను గానీ అలా ఏమీ జరగలేదని చెప్పింది. బహుశా షారుక్ చేతులు చాచి పిలవని ఏకైక హీరోయిన్ తానే అయి ఉంటానని కాస్తంత బాధపడింది. వెంటనే దానికి స్పందించిన షారుక్.. ''నువ్వు చాలా చిన్నదానివి.. నేను నిన్ను ఒక పాటలో ఎత్తుకున్నా'' అన్నాడు. షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం వచ్చిందనగానే తాను చాలా ఉద్వేగానికి గురయ్యానని, ఆయన సినిమాలు చూస్తూనే తాను నటిగా ఎదిగానని మాహిరా తెలిపింది. ముంబైలో అడుగుపెట్టగానే తన దుపట్టా గాల్లో ఎగురుతూ వెళ్తుందని, షారుక్ తనవైపు పరుగున వస్తారని అనుకున్నాను గానీ అలా ఏమీ జరగలేదని చెప్పింది. దాంతో, ''ఇప్పుడు నువ్వు ఒకరకంగా నా వయసు ఎంతన్న విషయం అందరికీ చెప్పేస్తున్నావు. దుపట్టా సీన్ మనకు గుజరాత్లో ఉంది.. బడ్జెట్ ఎక్కువ లేదు కాబట్టి అలా చేశారు గానీ, లేకపోతే స్విట్జర్లాండ్‌లో తీసేవాళ్లం'' అని షారుక్ జోకు పేల్చాడు. హిందీ సినిమాలో డాన్సు చేస్తూ, ముఖంలో భావాలు కూడా పలికించడం తనకు చాలా కష్టమైందని మాహిరా చెప్పింది. -
పాక్ నటి ప్రచారంపై ఠాక్రేకు షారుక్ హామీ
ముంబై: తన తాజా చిత్రం ‘రయీస్’ ప్రచార కార్యక్రమాల్లో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ పాల్గొనబోదని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు హామీ ఇచ్చారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా ఈ హామీ ఇచ్చారని ఎంఎన్ఎస్ చిత్రపథ్ కర్మచారి సేన చీఫ్ అమీ ఖోప్కర్ సోమవారం చెప్పారు. రయీస్ ప్రదర్శనను తాము అడ్డుకోబోమని, ఈ సినిమాలో పాలుపంచుకున్న పాక్ నటులెవరూ ఇక్కడ ఉండరని అన్నారు. రయీస్ సినిమాలో మహీరా నటించారు. -
సూపర్‌స్టార్‌కు రాజ్‌ఠాక్రే ఏం చెప్పారు?
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటించిన రయీస్ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా అంటే వచ్చే సంవత్సరం జనవరి 26వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమాలో హీరోయిన్గా పాకిస్థానీ నటి మహీరా ఖాన్ నటించడమే సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది. పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను విడుదల కానివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్ ఠాక్రే ఇంతకుముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఏమవుతుందోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో.. సినిమా హీరో షారుక్ ఖాన్ స్వయంగా రాజ్‌ఠాక్రే వద్దకు వెళ్లి సినిమా గురించి, సినిమా ప్రచారం గురించి వివరణ ఇచ్చుకున్నారు. మాహిరాఖాన్ ఈ సినిమాను భారతదేశంలో ఏమాత్రం ప్రమోట్ చేయబోదని షారుక్ చెప్పారు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో జరిగిన సమావేశంలో భవిష్యత్తులో తీయబోయే సినిమాలు వేటిలోనూ పాకిస్థానీ ఆర్టిస్టులు ఉండబోరని హామీ ఇచ్చారని, అలాగే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మాహిరాఖాన్ ప్రచారం చేస్తుందంటూ వచ్చిన కథనాలను కూడా షారుక్ ఖండించారని రాజ్ ఠాక్రే చెప్పారు. అయితే ఇంతకుముందు ఈ సినిమా నిర్మాత రితేష్ సిధ్వానీ మాత్రం మాహిరా ఖాన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. అవసరమైతే ఆమెతో కూడా భారతదేశంలో సినిమాను ప్రమోట్ చేయిస్తామని ఆయన చెప్పారు. పాకిస్థానీ నటులు భారతదేశంలో ప్రవేశించకుండా ప్రభుత్వం వైపు నుంచి నిషేధం ఏమీ లేదని అన్నారు. కరాచీకి చెందిన మాహిరా ఖాన్ (31) దుబాయ్‌లో షారుక్‌తో కలిసి రెండు పాటల షూటింగ్లో పాల్గొంటుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి. -
అమ్మ నా మాటలు నమ్మలేదు: నటి
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న మూవీ ‘రాయిస్’. ఈ మూవీలో బాలీవుడ్ బాద్షా హీరో కాగా, పాకిస్తాన్ నటి మహీరాఖాన్ ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఉడీలో పాక్ ఉగ్రదాడుల తర్వాత దాయాది దేశానికి చెందిన ఆర్టిస్టులపై నిషేధం, వారు నటించిన మూవీలను విడుదలను అడ్డుకోవాలంటూ 'రాయిస్', 'ఏ దిల్ హై ముష్కిల్' లపై ఇటీవల పెనుదుమారం చెలరేగింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మహీరా కొన్ని విషయాలను తెలిపింది. తన తల్లికి బాలీవుడ్ ఎంట్రీ విషయం చెప్పగా ఆమె పెద్దగా షాక్ కాలేదని, అయితే స్టార్ హీరో షారుక్ సరసన నటిస్తున్నానని చెబితే నమ్మలేదని చెప్పింది. 'నువ్వు అబద్దం చెబుతున్నావు, ఎందుకంటే షారుక్ లాంటి అగ్రహీరో మూవీతో ఎంట్రీ ఛాన్స్ దక్కడం ఎవరికైనా కష్టమే' అన్న మా అమ్మ ఈ విషయాన్ని నమ్మిన వెంటనే ఉద్వేగానికి లోనై ఒక్కసారిగా ఏడ్చేసిందని నటి మహీరా చెప్పుకొచ్చింది. మోహసినా అనే పాత్రలో తాను రాయిస్ లో కనిపించనుంది. వచ్చే ఏడాది జనవరి 26న మూవీని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. -
నన్ను తప్పించి.. పాక్ నటికి ఛాన్స్: హీరోయిన్
ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందిస్తున్న చిత్రం 'రాయిస్'. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పాకిస్తాన్ నటి మహీరాఖాన్ జంటగా నటిస్తున్న మూవీకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వాస్తవానికి ఈ మూవీలో తొలుత ఫెమినా మాజీ మిస్ ఇండియా-2011, అంకితా షోరేనును షారుక్ సరసన అవకాశం కల్పించారు. ఇంతలోనే ఏం జరిగింతో ఈ ప్రాజెక్టు నుంచి తనను తప్పించారని వదంతులు ప్రచారం అయ్యాయని అంకితా చెప్పింది. స్క్రీన్ టెస్టులు చేసి తనకు ఆల్ మోస్ట్ ఒకే చెప్పారని, ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు షారుక్ తన పేరును సూచించినట్లు నటి అంకితా తెలిపింది. దర్శకుడు, నిర్మాత మాత్రం పాకిస్తాన్ కు చెందిన ముస్లిం యువతిని ఈ పాత్రకోసం తీసుకోవాలని భావించారట. 'నా స్థానంలో పాక్ నటి మహీరాఖాన్ కు ఛాన్స్ ఇచ్చారు. షారుక్ లాంటి అగ్రహీరో సరసన అవకాశం తృటిలో తప్పిపోయినందుకు కాస్త బాధపడ్డాను. కేవలం దేశానికి చెందిన నటిని కావడం వల్ల అవకాశం దక్కలేదు' అని తొలిసారిగా 'రాయిస్' మూవీలో హీరోయిన్ పాత్ర ఎంపిక గురించి అంకితా చెప్పుకొచ్చింది. పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో మహీరా లేని కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిపివేశారు. -
ఉడీ ఉగ్రదాడులపై నోరువిప్పిన పాక్ నటి
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉడీ ఉగ్రదాడులపై పాకిస్తాన్ ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. తొలుత ఫవాద్ ఖాన్ ఉడీలో జరిగిన ఉగ్రదాడులను ఖండించగా.. ప్రస్తుతం పాకిస్తాన్ నటి మహీరాఖాన్ సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనను వ్యతిరేకించింది. ఉడీలో పాక్ ఉగ్రదాడులు, అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించారు. మొదట ఫవాద్ ఖాన్ స్పందిస్తూ.. తన భార్యకు డెలివరీ ఉందని తాను మూడు నెలలుగా పాక్ లోనే ఉన్నానని, అయితే ఉగ్రదాడులు ఏ దేశం చేసినా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఉన్నా ఒప్పుకుంటారు కానీ ఉగ్రదాడులు జరిగే ప్రాంతాల్లో ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరని మహీరాఖాన్ తెలిపింది. ఇరుదేశాలు శాంతిని పాటించాలని, ఉగ్రదాడుల వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. గత ఐదేళ్లుగా నటిగా కొనసాగుతున్న తాను పాక్ గౌరవానికి భంగం వాటిల్లేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాయిస్' సినిమాతో పాక్ నటి మహీరాఖాన్ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో 'రాయిస్' మూవీ షూటింగ్ మధ్యలోనే మహీరా పాక్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’ చిత్రంపై పాకిస్తాన్ లో ఇదివరకే ఆంక్షలు మొదలయ్యాయి. షారుఖ్ ఖాన్, మహీరా ఖాన్ జంటగా నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్తాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తుండగా.. సన్నీలియోన్, షారుక్ పై చిత్రీకరించిన ఆ ఐటం పాటపై పాక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో అక్కడ ఈ పాటను కట్ చేసి మూవీ రిలీజ్ చేయనున్నారు. -
అక్కడ సన్నీ లియోన్ ఐటం నంబర్ కట్
ఓ ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’ చిత్రంపై దాయాది దేశంలో అప్పుడే ఆంక్షలు మొదలయ్యాయి. షారూఖ్ ఖాన్ హీరోగా, పాకిస్థానీ నటి మహీరా ఖాన్ హీరోయిన్ నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్థాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఆ సినిమా పాటల ఆల్బమ్ లో నాటి బాలీవుడ్ హిట్ సాంగ్ ‘లైలా ఓ లైలా..’ రిమిక్స్ వెర్షన్ కూడా ఉంది. షారూఖ్, సన్నీ లియోన్ లపై చిత్రీకరించిన ఆ ఐటం పాటలో ‘మసాలా’ కాస్త ఘాటుగానే ఉంటుందట. అయితే పాక్ లో విడుదలయ్యే ‘రాయిస్’లో ఆ ఒక్క పాటను మాత్రం కట్ చేయబోతున్నట్లు సమాచారం. (అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్) పాక్ లో పుట్టిపెరిగి, బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోన్న మహీరా ఖాన్ కు స్వదేశంలో ఉన్న ఆదరణతో వసూళ్లు రాబట్టవచ్చని ‘రాయిస్’ రూపకర్తల అభిప్రాయం. అయితే సన్నీ ఐటం నబంర్ పై మాత్రం పాకిస్థానీలు ఆగ్రహం వెలిబుచ్చే అవకాశం ఉందని, అందుకే ఆ పాటను తొలిగించి విడుదల చేయబోతున్నారని వార్తా సంస్థ‘ఏసియన్ ఏజ్’ పేర్కొంది. గౌరీఖాన్, రితేశ్ సిద్వానీ, ఫరాఖాన్ ల సంయుక్త నిర్మాణంలో రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించిన ‘రాయిస్’ 2017 జనవరి 26న విడుదలకానుంది. (నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు: షారూఖ్) -
ఆ ఫొటో పెట్టినందుకు హీరోయిన్ సారీ!
ముంబై: పాకిస్థానీ నటి మహీరాఖాన్ ట్విట్టర్లో పెట్టిన ఓ ఫొటో వివాదాస్పదమైంది. ఇటీవల హాలోవిన్ పార్టీ సందర్భంగా శివసేన అధినేత బాల్‌ఠాక్రేను పోలినవిధంగా దుస్తులు వేసుకొని, నుదుట తిలకం ధరించిన పాకిస్థాన్ దర్శకుడు అసీజ్ రజాతోపాటు ఆమె దిగిన ఈ ఫొటో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నది. ఈ ఫొటోలో శివసైనికుడి మాదిరిగా దుస్తులు వేసుకున్న దర్శకుడు రజా 'మహీరాకో బార్ నికాలో' (మహీరాను వెళ్లగొట్టండి) అన్న ప్లకార్డు పట్టుకొని ఉండగా.. ఆయన పక్కన క్యాట్ వుమన్ డ్రెస్‌లో ఉన్న మహీరా కనిపించింది. ఈ ఫొటో వెలుగుచూడటంతో మహీరాఖాన్ క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, ఈ ఫొటో వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆమె తెలిపారు. పాక్ నటి అయిన మహీరాఖాన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాయిస్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. పాకిస్థాన్ నటులు బాలీవుడ్లో నటించవద్దని శివసేన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మహీరాఖాన్ ఫొటోపై పలు విమర్శలు వచ్చాయి. -
పాకిస్తానీ నటులను టార్గెట్ చేసిన శివసేన
ముంబై: పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడరాదంటూ బీసీసీఐ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన శివసేన సైనికులు.. ఇప్పుడు పాకిస్తానీ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్‌లను టార్గెట్ చేసుకున్నారు. ఫవాద్, మహీర్ నటించిన బాలీవుడ్ సినిమాల ప్రమోషన్లను మహారాష్ట్రలో అడ్డుకోవాలని శివసైనికులు నిర్ణయించారు. పాకిస్తాన్ క్రికెటర్లు, నటులు, కళాకారులను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయరాదని నిర్ణయం తీసుకున్నట్టు చిత్రపత్ సేన ప్రధాన కార్యదర్శి అక్షయ్ బర్దపుర్కార్ చెప్పారు. పాకిస్తానీ నటులకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. ఇటీవల పాకిస్తానీ గాయకుడు గులాం అలీ ప్రదర్శనను శివసేన అడ్డుకున్న సంగతి తెలిసిందే.