మహిరా ఖాన్(ఫైల్)
పాకిస్తానీ నటి మహీరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. షారుఖ్ ఖాన్ ‘రయిస్’ సినిమాతో ఆమె బాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. మహీరా ఒక పార్టీలో దమ్ముకొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ ఘటనపై కొందరు ఆమె పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే, మరి కొందరు మాత్రం మహీరాకు మద్దతుగా నిలిచారు.
మగవారు తాగితే తప్పులేదు కానీ, మేం తాగితే తప్పేంటి?, మేం తాగడం తప్పైతే మీరు తాగడమూ తప్పే, తన వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? తన ఇష్టం తనది అంటూ పలువురు మహిళలు ఆమెకు బాసటగా నిలిచారు. గతంలో కూడా మహిరా ఖాన్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లండన్‌లో హీరో రణవీర్ కపూర్‌తో కలిసి మహీరా స్మోక్ చేయటంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఓ వైపు ఆమె స్మోక్ చేయడాన్ని పలువురు తప్పుబడితే... పాకిస్తానీలు మాత్రం రణబీర్‌తో కలిసి స్మోక్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment