సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి మహీరా ఖాన్‌కు సొంత దేశం పాక్‌లోనూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇష్టం లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెకు పలువురు సలహా ఇస్తున్నారు. అందుకు కారణం తన తాజా చిత్రం వెర్నా పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన ఓ పోస్టు.
సినిమా ప్రారంభంలో ప్రదర్శించే డిస్‌క్లెయిమర్(అంతా కల్పితం.. తాము బాధ్యులము కాదంటూ ప్రదర్శించటం) ను పోస్ట్ చేసిన మహీరా ‘‘ఈ చిత్రంలో ప్రతీది కల్పితమే. అంటే నిజాన్ని నిగ్గుగా చెప్పలేక పోవటమే. ఈ చిత్రంలోని సన్నివేశాలు కూడా ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల మాదిరిగానే హస్యాస్పదంగా ఉన్నాయి’’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి కొందరు ఘాటుగా స్పందించారు. ఈ దేశంలో నిబంధనలు ఇలాగే ఉంటాయి. ఇతర దేశాల్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులే ఉన్నాయ్. ఇష్టంలేకపోతే పాక్‌ను విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు. మరికొందరు ఇంకోసారి ఇలాంటివి పోస్ట్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
కాగా, గవర్నర్ కొడుకు ఓ యువతిని అత్యాచారం చేయటం అన్న నేపథ్యంతో వెర్నా చిత్రం రూపుదిద్దుకోగా.. అందులో న్యాయపోరాటం చేసే బాధితురాలిగా మహీరా నటించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి చిక్కులు ఎదురుకావటంతో వివాదాస్పదంగా కాగా.. చివరకు అభ్యంతరకర సన్నివేశాల తొలగింపు మేరకు చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేయటంతో విడుదల అయ్యింది. ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ తో వెర్నా అక్కడ ప్రదర్శితమౌతోంది.
Comments
Please login to add a commentAdd a comment