పాకిస్తానీ నటులను టార్గెట్ చేసిన శివసేన
ముంబై: పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ ఆడరాదంటూ బీసీసీఐ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన శివసేన సైనికులు.. ఇప్పుడు పాకిస్తానీ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్లను టార్గెట్ చేసుకున్నారు. ఫవాద్, మహీర్ నటించిన బాలీవుడ్ సినిమాల ప్రమోషన్లను మహారాష్ట్రలో అడ్డుకోవాలని శివసైనికులు నిర్ణయించారు.
పాకిస్తాన్ క్రికెటర్లు, నటులు, కళాకారులను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయరాదని నిర్ణయం తీసుకున్నట్టు చిత్రపత్ సేన ప్రధాన కార్యదర్శి అక్షయ్ బర్దపుర్కార్ చెప్పారు. పాకిస్తానీ నటులకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. ఇటీవల పాకిస్తానీ గాయకుడు గులాం అలీ ప్రదర్శనను శివసేన అడ్డుకున్న సంగతి తెలిసిందే.