Fawad
-
లైవ్ టీవీ షోలో ఏడ్చేసిన పాక్ మాజీ మంత్రి.. వీడియో వైరల్..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ చౌదరి లైవ్ టీవీ షోలో బోరున విలపించారు. దేశద్రోహం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్‌ను ప్రశ్నించారు. తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు. ఫవాద్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
పాక్ జోక్యం సహించం: ప్రధానికి కేజ్రీవాల్ మద్దతు!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని.. ఇందులో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పాక్ మంత్రి ఫవాద్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కశ్మీర్ అంశం, పౌరసత్వ సవరణ చట్టంపై బాహ్య ప్రపంచం నుంచి వస్తున్న విమర్శలు, ఆర్థిక మందగమనం కారణంగా మోదీకి మతి చలించిందని.. అందుకే అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారంటూ ఫవాద్ ట్వీట్ చేశారు. (ఢిల్లీ అసెంబ్లీ పీఠం: ఈ అంచనాలు నిజమేనా?) ఈ క్రమంలో ఫవాద్ ట్వీట్‌పై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్... ‘‘ నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి. ఆయన నాకు కూడా ప్రధాన మంత్రే. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత అంశం. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారి జోక్యాన్ని మేము అస్సలు సహించం. భారత ఐకమత్యానికి హాని తలపెట్టాలని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కేజ్రీవాల్‌ను విమర్శిస్తున్నా.. ఆయన మాత్రం హుందాగా వ్యవహరిస్తున్నారు’’అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేజ్రీవాల్.. భారత్, ప్రధానిపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా... 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. नरेंद्र मोदी जी भारत के प्रधानमंत्री है। मेरे भी प्रधानमंत्री है। दिल्ली का चुनाव भारत का आंतरिक मसला है और हमें आतंकवाद के सबसे बड़े प्रायोजकों का हस्तक्षेप बर्दाश्त नहीं। पाकिस्तान जितनी कोशिश कर ले, इस देश की एकता पर प्रहार नहीं कर सकता। https://t.co/E2Rl65nWSK — Arvind Kejriwal (@ArvindKejriwal) January 31, 2020 -
సర్కారీ కొలువులు లేవు..
ఇస్లామాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడవద్దని సర్కారీ కొలువులు లేవని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో కీలక మంత్రి ఫవాద్ చౌధరి స్పష్టం చేశారు. పాలక పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఎన్నికల హామీకి విరుద్ధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ప్రభుత్వం నుంచి ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. ఇంజనీరింగ్ సంస్థల డీన్స్ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాక్ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని చేతులెత్తేశారు. పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కుచించుకుపోతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు గ్రహించడం ముఖ్యమని, మనం ఉద్యోగాల కోసం ప్రభుత్వం వైపు చూస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని అన్నారు. 1970 ప్రాంతాల్లో ప్రభుత్వం ఉద్యోగాలు సమకూరుస్తుందనే వైఖరి ఉండేదని, ఇప్పుడు ప్రైవేటు రంగం ఉపాథి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. -
చైనా సాయంతో మేము సైతం : పాక్!
ఇస్లామాబాద్ : చైనా ఉపగ్రహాల సహాయంతో 2022లో తమ మొట్టమొదటి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపుతామని పాకిస్తాన్ గురువారం వెల్లడించింది. ఈ క్రమంలో వ్యోమగామి ఎంపిక ప్రక్రియ 2020 ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ మేరకు...‘ అంతరిక్షంలో అడుగుపెట్టబోయే తొలి పాకిస్తానీ ఎంపిక 2020లో ప్రారంభిస్తాం. ఎంపిక ప్రక్రియలో భాగంగా యాభై మందిని షార్ట్‌లిస్ట్ చేస్తాం. క్రమేణా ఆ జాబితా 25 నుంచి ఒకటికి తగ్గి 2022 నాటికి అంతరిక్షం చేరుకునే మొదటి వ్యక్తిని పాక్ సగర్వంగా ప్రకటిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి సాధించే విషయమై మా దేశంలో ఇదే అతిపెద్ద కార్యక్రమం. ఈ ప్రకటన చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నా’ అని ఆ దేశ సాంకేతికాభివృద్ధి మంత్రి ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. అదే విధంగా ఈ ప్రయోగంలో వ్యోమగాముల ఎంపిక విషయంలో పాక్ వాయు సేన కీలక పాత్ర పోషిస్తుందని ఫవాద్ చౌదరి వెల్లడించారు. కాగా చంద్రుని మూలాలు కనుగొనే క్రమంలో భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. తద్వారా రష్యా, అమెరికా, చైనా దేశాల తర్వాత చంద్రుడిపై పరిశోధనలు చేసిన నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. ఈ నేపథ్యంలో దాయాది దేశం తమ అంతరిక్ష ప్రయోగం గురించి ప్రకటన చేయడం గమనార్హం. -
పాకిస్తానీ నటులను టార్గెట్ చేసిన శివసేన
ముంబై: పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడరాదంటూ బీసీసీఐ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన శివసేన సైనికులు.. ఇప్పుడు పాకిస్తానీ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్‌లను టార్గెట్ చేసుకున్నారు. ఫవాద్, మహీర్ నటించిన బాలీవుడ్ సినిమాల ప్రమోషన్లను మహారాష్ట్రలో అడ్డుకోవాలని శివసైనికులు నిర్ణయించారు. పాకిస్తాన్ క్రికెటర్లు, నటులు, కళాకారులను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయరాదని నిర్ణయం తీసుకున్నట్టు చిత్రపత్ సేన ప్రధాన కార్యదర్శి అక్షయ్ బర్దపుర్కార్ చెప్పారు. పాకిస్తానీ నటులకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. ఇటీవల పాకిస్తానీ గాయకుడు గులాం అలీ ప్రదర్శనను శివసేన అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
కాసుల కళకళ..
పొదుపులో భాగంగా మదుపు చేయడం ఒక కళ. అయితే, కళలోనే మదుపు చేయడానికి ‘సిటీ’జనులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఇప్పటివరకు కళాఖండాలు హోదాకు చిహ్నంగా, అలంకారప్రాయంగానే ఉంటూవస్తున్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే పెట్టుబడి సాధనాలుగా మారుతున్నాయి.ఈ పరిణామం ఔత్సాహిక కళాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది. ..:: ఎస్.సత్యబాబు పికాసో చిత్రం ‘న్యూడ్ గ్రీన్ లీవ్స్ అండ్ బస్ట్’ ఎంతకు అమ్ముడయ్యిందో తెలుసా... 106 మిలియన్ డాలర్లు అంటే అక్షరాలా రూ.475 కోట్లు. ఒక కళాఖండానికి పలికిన అత్యధిక ధర ఇప్పటి వరకు ఇదే. క్రిస్టీస్ వేలంశాల నిర్వహించిన వేలంలో మన భారతీయ కళాకారుడు సయ్యద్‌హైదర్ రజా పెయింటింగ్ ‘ది సౌరాష్ట్ర’కు 3.5 మిలియన్ డాలర్లు అంటే రూ.16 కోట్లు పలికింది. అదే ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన ఇండియన్ పెయింటింగ్. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్ట్‌వర్క్‌లకు అనూహ్యమైన ధరలు పలుకుతుండటంతో సిటీలోని కళాపోషకులు ఇన్వెస్ట్మెంట్ సాధనంగానూ కళాఖండాలను కొనుగోలు చేసే ట్రెండ్ మొదలైంది. రేపటి రూటే సప‘రేటు’... 1990 ప్రాంతంలో ఎమ్ఎఫ్ హుస్సేన్ చిత్రాలు లక్ష రూపాయల వరకు పలికేవి. ఇప్పుడు ఆయన చిత్రాల ధర రూ.50 లక్షలకు పైమాటే. రజా, ఆంజోలీ ఇళా మీనన్, ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా వంటి ప్రసిద్ధ భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్ ధరలూ అంతే. సిటీ విషయానికి వస్తే తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్, సూర్యప్రకాశ్, సచిన్ జల్తారే వంటి వారి కళాఖండాలను ఎంచుకుంటున్నారు. కొనుగోలు ‘కళ’... ఇండియాలో ఆర్ట్ మార్కెట్ ఇంకా రెగ్యులేట్ కాలేదనే చెప్పాలి. అమెరికాలో అయితే కొన్న వ్యక్తే తిరిగి గ్యాలరీకి విక్రయించవచ్చు. ఇక్కడ అలాంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్ట్ వర్క్‌పై అవగాహన ద్వారా మాత్రమే కళాఖండాల్లో సరైన పెట్టుబడులు పెట్టగలం. ఒక ఫేమస్ ఆర్టిస్ట్ పెయింటింగ్‌ను మనం కొంటే అది ఐదారేళ్లలో విలువ కొంత పెంచుకుంటుంది. సరైన రిటర్న్స్ రావాలంటే మాత్రం కనీసం పది నుంచి పన్నెండేళ్లు పడుతుందని ఆర్ట్స్ ట్రస్ట్ నిర్వాహకుడు సేథీ అంటున్నారు. బాగా పేరొందిన ఆర్టిస్ట్‌ల వర్క్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే ఆయా ఆర్టిస్ట్‌ల డిటైల్డ్ ఆక్షన్ హిస్టరీ తీసుకోవాలి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. * కాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్ అనేది వ్యయభరితమైనది. ఆ తర్వాత వ్యయ భరితమైన వాటిలో కాన్వాస్‌పై ఆక్రిలిక్, పేపర్ మీద ఆక్రిలిక్ వస్తాయి. ప్రత్యామ్నాయంగా పేపర్ మీద వాటర్కలర్ అయితే తక్కువ ఖరీదు ఉంటాయి. అదే పేపర్ మీద చార్కోల్ అయితే మరింత తక్కువ ఖరీదులో లభిస్తాయి. * పేరున్న ఆర్టిస్ట్‌లవి అయినంత మాత్రాన అన్నీ మాస్టర్పీస్లే అయి ఉండాలని లేదు. మాస్టర్పీస్లను ఎంచుకునేటప్పుడు నిపుణుల సలహా తప్పక తీసుకోవాలి. * ఆర్ట్ అనేది మంచి పెట్టుబడి. అయితే కేవలం పెట్టుబడి సాధనంగానే దాన్ని చూస్తే మనం మంచి పీస్‌ని కొనలేం. కేవలం విక్రయించడం అనే అంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవద్దు. దీర్ఘకాలం తర్వాత అది అమ్మాలనే నిర్ణయం మారవచ్చు కూడా. * ఆర్టిస్ట్‌లకు రకరకాల ప్రత్యేకతలుంటాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వడ్డీ, డివిడెండ్లు రావు. తక్కువపెట్టుబడి పెట్టాలనుకున్నవారు పేరొందిన ఆర్టిస్ట్‌లు చేసిన పేపర్వర్క్స్ను ఎంచుకోవచ్చు. * ఆర్టిస్ట్ పెన్సిల్‌తో సంతకం చేసి ఉన్న ఒరిజినల్ ప్రింట్స్ అసలైన వాటికి నకలైనా కూడా వాటి విలువ వాటికీ ఉంటుంది. * మార్కెట్లోకి దూసుకొస్తున్న వర్ధమాన చిత్రకారుల వర్క్స్‌పై ఒక కన్నేసి ఉంచాలి. * అంతర్జాతీయంగా ఆర్ట్ సైకిల్ తొమ్మిదేళ్లు ఉంటుంది. అన్నాళ్లు వెయిట్ చేయడానికి సిద్ధపడాలి. * కొనేటప్పుడు అథెంటిసిటీ సర్టిఫికెట్, అథెంటిసిటీ గ్యారంటీ, ప్రొవెనెన్స్ సర్టిఫికెట్ పరిశీలించుకోవాలి. * మన మొత్తం ఆదాయంలో ఆర్ట్‌పై పెట్టే పెట్టుబడి 5 శాతానికి మించకూడదని ఫైనాన్షియల్ అడ్వయిజర్ కిలారి ప్రవీణ్ సూచిస్తున్నారు. నగరంలో ఇప్పుడిప్పుడే కొన్ని ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెయింటింగ్స్ విషయంలో తగిన సూచనలు సలహాలు అందించడంతో పాటు వాటిని సురక్షితంగా స్టోర్ చేసే మార్గాలనూ సూచిస్తున్నాయి. ప్రత్యక్షంగా సూర్యకాంతి పడని చోట ఆర్ట్‌వర్క్‌ను ఉంచాలి. దీర్ఘకాలం స్టోర్ చేస్తున్నట్టయితే తరచుగా పరిశీలిస్తుండాలి. * మొదటి సారి కొంటున్నట్టయితే ఒక ఆర్ట్ కన్సల్టెంట్ లేదా ఒక అడ్వయిజర్‌ను సంప్రదించాలి. ఖరీదైన వాటికి కన్సల్టెంట్స్ ఆర్ట్ వర్క్ విలువలో 2 నుంచి 5 శాతం ఫీజును తీసుకుంటున్నారు. చిన్నపాటి పెయింటింగ్స్‌కు 5-15 శాతం దాకా ఉంటుంది. * పాశ్చాత్య దేశాల్లో ఆర్టిస్ట్ వర్క్స్‌కు వాల్యూని నిర్ణయించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఆర్టిస్ట్‌కు ఉన్న డిమాండ్, పెయింటింగ్ క్వాలిటీ, సైజ్, తయారైన సంవత్సరం.. వంటివి చూసి మాత్రమే విలువ నిర్ణయిస్తున్నారు. * భారతీయ ఆర్ట్ మార్కెట్ రానున్న పదేళ్లలో మంచి గ్రోత్ సాధిస్తుందని నిపుణుల అంచనా. * కనీసం ఐదేళ్లు దాన్ని అట్టేపెట్టుకున్నట్లయితే ఏడాదికి 8 నుంచి 10 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునంటున్నారు. దీర్ఘకాలం వేచి ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ట్ పీస్‌లు ప్రత్యక్షంగా కొనడం సాధ్యపడకపోతే ఆర్ట్ ఫండ్స్‌లో కూడా పెట్టవచ్చు. ఆర్ట్హౌస్లు మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్నాయి. * ఒకటి మాత్రం నిజం.. కళను కళగానే చూడాలి. పెట్టుబడి సాధనంగా మాత్రమే అనుకుంటే, దాని అసలైన అనుభవాన్ని ఆస్వాదించలేం. కాబట్టి, అది ఎంత రిటర్న్ ఇస్తుంది అనేదానిని బట్టి కాక మనస్ఫూర్తిగా నచ్చిందే కొనుగోలు చేయాలి. సిటీ ఆర్ట్ మార్కెట్ సత్తా నాలుగేళ్లలో రెట్టింపు లాభాలను అందించిన వర్క్స్ కూడా సిటీ ఆర్టిస్ట్‌ల నుంచి వచ్చాయి. విదేశీ మార్కెట్ కూడా సిటీ ఆర్ట్‌కు ఊపునిస్తోంది. నగరానికి చెందిన ఒక ఆర్టిస్ట్ వర్క్ ఇటీవల రూ.35 లక్షలకు పైగా ధరకు విక్రయమవ్వడం సిటీ ఆర్ట్ మార్కెట్ సత్తాకు అద్దం పట్టింది. మేం రీసెంట్గా ఇన్వెస్ట్‌మెంట్‌కు అద్భుతమైన అవకాశం ఇచ్చే షోని మా తంకానత్ గ్యాలరీలో నిర్వహిస్తున్నాం. ఇవి పెట్టుబడికి రైట్ ఛాయిస్ అనే ఉద్దేశంతో ఆర్ట్ కలెక్టర్స్ బాగా కొనుగోలు చేస్తున్నారు. - ఫవాద్, ఆర్టిస్ట్