![Actress Mahira Khan Serious Reaction To Netizen Comment Who Called Her Bhikhari Pakistani - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/12/mahira-khan1.gif.webp?itok=Q8F5Jz-2)
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లు వేసుకున్న డ్రెస్, సినిమాలు, వ్యవహారశైలి, కామెంట్స్ ఏవి నచ్చకపోయినా సరే నెటిజన్లు విమర్శించడం పరిపాటిగా మారింది. చాలామంది సెలబ్రిటీలు ఈ ట్రోలింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తారు కానీ కొందరు మాత్రం ఘాటుగానే రియాక్ట్ అవుతారు. తాజాగా పాకిస్తాన్ నటి మహీరా ఖాన్‌ను ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించాడు.
'పాకిస్తానీ బిచ్చగత్తె.. ముందు నీ దేశం మీద ఫోకస్ పెట్టు' అని కామెంట్ చేశాడు. ఇది చూసిన మహీరా.. 'నువ్వేంటి మరి నా మీద దృష్టి పెడుతున్నావ్' అని కౌంటరిచ్చి అతడి నోరు మూయించింది. తర్వాత ఈ ట్వీట్లను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇక మరో నెటిజన్.. 'మహీరాగారు.. ప్లీజ్ ఒక్కసారి మీకు ప్రపోజ్ చేయవచ్చా?' అని అడిగాడు. దీనికామె ఎవరు వద్దంటున్నారు, చేసేయ్ అని బదులిచ్చింది. కాగా మహీరా 2017లో రయూస్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటించింది. ఆ తర్వాత భారత్‌లో పాకిస్తాన్ నటులపై నిషేధం విధించడంతో ఆమె ఇక్కడ మరే సినిమాలోనూ నటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment