![Mahira Khan To Make Malayalam Debut With L2 Empuraan - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/26/ma.jpg.webp?itok=U_PHkee4)
ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్. ఆమె త్వరలోనే మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తోన్న ఎల్2: ఎంపురాన్‌లో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. మహీరా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనేపథ్యంలో పృథ్వీరాజ్‌తో ఉన్న మహీరా పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో విడుదలైన లూసిఫర్ పార్ట్-2గా ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కాగా.. మహీరా ఖాన్ విషయానికొస్తే.. 2017 బాలీవుడ్ చిత్రం రయీస్‌లో షారుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. అయితే 2016 యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. దీంతో నిషేధం తర్వాత ఆమె ఇండియాలో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇటీవలే పాకిస్థానీ కళాకారులపై ఉన్న నిషేధాన్ని ముంబై హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మహీరా ఖాన్ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే.
Is this an old photo?#PrithvirajSukumaran with #Mahirakhan pic.twitter.com/SvVMQG5MQD
— AKV (@AnandKr13834547) November 26, 2023
Comments
Please login to add a commentAdd a comment