రణ్‌బీర్‌తో నటి వైరల్‌ వీడియో హల్‌చల్‌ | Ranbir Kapoor and Mahira Khan in an intense discussion is going viral | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌తో నటి వైరల్‌ వీడియో హల్‌చల్‌

Published Mon, Mar 20 2017 3:29 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

రణ్‌బీర్‌తో నటి వైరల్‌ వీడియో హల్‌చల్‌

రణ్‌బీర్‌తో నటి వైరల్‌ వీడియో హల్‌చల్‌

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, నటి మహీరా ఖాన్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారి మధ్య చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అయ్యి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దుబాయ్‌లోని ఓ కార్యక్రమంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. తొలుత ఈ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు ఏం చక్కా నవ్వులు చిందిస్తూ రెడ్‌ కార్పెట్‌లో నడుస్తూ అతిథుల మధ్యకు వెళ్లారు. అందరినీ సరదాగా పలుకరించారు.

ఫొటోలకు పోజులిచ్చారు. అయితే, ఆ తర్వాతే వారిమధ్య ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఓ తలుపువద్ద రణ్‌బీర్‌ నిల్చుని చూస్తుండగా అతడిని ఏదో బతిమిలాడుతున్నట్లుగా మహీరా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నట్లు కనిపించింది. ఆ సమయంలో రణ్‌బీర్‌ కాస్తంత అసహనంతో చిరాకుతో ఉన్నాడు. ఆమెను ఏదో సముదాయిస్తున్నట్లుగా కనిపించాడు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఆ వీడియో ఇప్పుడు బయటకు రాగా అది ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement