కడుపులో బిడ్డను మోసే మహిళ.. తల్లినయ్యే క్షణాల కోసం ఎంతో ఎదురుచూస్తుంది. డెలివరీ అవగానే బిడ్డను ఎత్తుకుని మురిసిపోతుంది. అయితే కొందరు ఈ సమయంలో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (ప్రసూతి వైరాగ్యం) బారిన పడుతున్నారు. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారు. అందులో తానూ ఒకరిని అంటోంది పాకిస్తాన్ నటి సర్వత్ గిలానీ.
ఆపరేషన్ అయిన నాలుగు రోజులక..
సర్వత్ గిలానీ మాట్లాడుతూ.. 'డెలివరీ సమయంలో నాకు పెద్ద సర్జరీ చేశారు. నాలుగు రోజుల తర్వాతే నా బిడ్డను ఎత్తుకున్నాను. ప్రసూతి అనంతరం ఒత్తిడికి లోనయ్యాను. పాలివ్వడానికి నేను, తాగడానికి తాను కష్టపడుతోంది. ఈ బాధను భరించేబదులు తను పోయినా బాగుండేదనుకున్నాను. చిన్నారిని పైకి పంపించాలన్న ఆలోచనలు వస్తున్నాయని ఏడుస్తూ నా భర్త ఫహద్‌కు చెప్పాను.
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్..
అది విన్న అతడు ఇది ప్రసవానంతరం వచ్చే ఒత్తిడి మాత్రమే! ఈ పరిస్థితిలో ఏదైనా జరగొచ్చు. ముందు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకో.. అప్పుడు నీకంటూ ఓ అవగాహన వస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుందని ఓదార్చాడు' అని చెప్పుకొచ్చింది. కాగా సర్వత్ గిలానీ.. జవానీ ఫిర్ నహీ 1, 2 చిత్రాల్లో నటించింది. జాయ్‌లాండ్ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లోనూ మెరిసింది.
చదవండి: హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్!
Comments
Please login to add a commentAdd a comment