Postpartam Depression
-
కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్ నటి
కడుపులో బిడ్డను మోసే మహిళ.. తల్లినయ్యే క్షణాల కోసం ఎంతో ఎదురుచూస్తుంది. డెలివరీ అవగానే బిడ్డను ఎత్తుకుని మురిసిపోతుంది. అయితే కొందరు ఈ సమయంలో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (ప్రసూతి వైరాగ్యం) బారిన పడుతున్నారు. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారు. అందులో తానూ ఒకరిని అంటోంది పాకిస్తాన్ నటి సర్వత్ గిలానీ.ఆపరేషన్ అయిన నాలుగు రోజులక..సర్వత్ గిలానీ మాట్లాడుతూ.. 'డెలివరీ సమయంలో నాకు పెద్ద సర్జరీ చేశారు. నాలుగు రోజుల తర్వాతే నా బిడ్డను ఎత్తుకున్నాను. ప్రసూతి అనంతరం ఒత్తిడికి లోనయ్యాను. పాలివ్వడానికి నేను, తాగడానికి తాను కష్టపడుతోంది. ఈ బాధను భరించేబదులు తను పోయినా బాగుండేదనుకున్నాను. చిన్నారిని పైకి పంపించాలన్న ఆలోచనలు వస్తున్నాయని ఏడుస్తూ నా భర్త ఫహద్‌కు చెప్పాను.పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్..అది విన్న అతడు ఇది ప్రసవానంతరం వచ్చే ఒత్తిడి మాత్రమే! ఈ పరిస్థితిలో ఏదైనా జరగొచ్చు. ముందు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకో.. అప్పుడు నీకంటూ ఓ అవగాహన వస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుందని ఓదార్చాడు' అని చెప్పుకొచ్చింది. కాగా సర్వత్ గిలానీ.. జవానీ ఫిర్ నహీ 1, 2 చిత్రాల్లో నటించింది. జాయ్‌లాండ్ సినిమాలో సపోర్టింగ్ రోల్లోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Sarwat Gilani 🇵🇰 (@sarwatg) చదవండి: హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్! -
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వ్యాపారం మొదలుపెట్టింది
‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ! స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సంప్రీత్కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కౌర్‌కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్‌కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్. ఆ ఆర్ట్‌కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని. పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్‌గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్‌లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్‌స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్‌ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది. ‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్‌ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్‌లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్‌వర్క్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన. ‘కౌర్ ఆర్ట్‌వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్‌లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్‌కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్. View this post on Instagram A post shared by Atinytwisted| MacrameIndia (@atinytwisted) -
తండ్రైన గర్వం అతడిలో.. కానీ ఆమె ఎందుకలా..?
ఆడవాళ్లకు ఆనందాన్ని పంచడమే కాదు.. వాళ్ల కష్టాన్ని తుడిచేసే మనసూ మగవాళ్లకు రావాలి!.. ఆ ప్రయత్నాన్నే చూపించాడు ‘జనన్య’ అనే మ్యూజిక్ వీడియోలో .. డైరెక్టర్ అనిల్ ఆనంద్. డెలివరీ తర్వాత తల్లులు అనుభవించే పోస్ట్పోర్టమ్ డిప్రెషన్ మీద మగవాళ్లకు అవగాహన కల్పించే మ్యూజిక్ వీడియో అది.. మహిళలను వినడానికి పురుషులు తలవంచారంటే .. సమానత్వం దిశగా ఒక అడుగుపడ్డట్టే కదా! ఈ కథనానికి సందర్భం.. మహిళా దినోత్సవం.. ఆ ఇంట్లో శుభకార్యం. బాలసారె (బారసాల). ఇల్లంతా పూలతో అలంకరించారు. చుట్టాలు, ఆత్మీయులతో సందడిగా ఉంది. ఒక జంట లోపలికి వచ్చింది.. చేతుల్లో చంటిబిడ్డతో. భర్త ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నాడు. కొత్తగా తండ్రైన గర్వం అతని మొహంలో తొణికిసలాడుతోంది. కాని బిడ్డను ఎత్తుకున్న ఆ తల్లే దిగులుగా.. విచారంగా.. ఇంకా చెప్పాలంటే బాధగా కనపడుతోంది. అందరూ నవ్వుతున్నారు కాని ఆమె మొహంలో నవ్వులేదు. తల్లి అయిన ఆనందమూ లేదు. ఆమె భావాలను అక్కడున్న వాళ్లెవరూ గమనించట్లేదు. ఆమె చేతుల్లోంచి బిడ్డను తీసుకున్నారు పెద్దవాళ్లు. వెంటనే ఆ తల్లి బాత్రూమ్లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడుస్తోంది. ఎంతసేపటికీ భార్య రాకపోయేసరికి కంగారుగా బాత్రూమ్ దగ్గరకు వెళ్లి భార్యను పిలుస్తూ తలుపు కొట్టాడు. మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆమె. తన భార్య దుఃఖంతో ఉందని అర్థమైంది అతనికి. ఎందుకో మాత్రం అర్థంకాలేదు. అడిగాడు ఆమెను. ఇదీ అని చెప్పలేకపోయింది కాని బిడ్డ పుట్టినప్పటి నుంచి తనలో కలుగుతున్న భావాలను బయటపెట్టింది. అప్పుడు భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు భర్త. తర్వాత.. వేడుక.. ఇల్లంతా పూలతో అలంకరించారు. చుట్టాలు, ఆత్మీయులతో సందడిగా ఉంది. ఆ తండ్రి ఉల్లాసంగా.. ఉన్నాడు. చేతుల్లో బిడ్డతో.. ఆనందంగా లోపలికి అడుగుపెట్టింది ఆ అమ్మ. బిడ్డను చూసి మురిసిపోతోంది. ప్రపంచంలోని సంతోషమంతా ఆ తల్లి మొహంలోనే తొణికిసలాడుతోంది. ఈ సీన్‌తో ఆ వీడియో అయిపోతుంది. అవును ఇది ఒక మలయాళంలో తీసిన మ్యూజిక్ వీడియో. పేరు.. జనన్య. అంటే మలయాళ భాషలో ‘భూమి’ అని అర్థమట. ఈ వీడియోకు దర్శకత్వం వహించింది ఆనంద్ అనిల్ కుమార్ అనే మలయాళ దర్శకుడు. మలయాళంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్, అండర్‌వరల్డ్ అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘జనన్య’ మ్యూజిక్ వీడియో టీమ్ జనన్య ఎందుకు? అనిల్ ఆనంద్ భార్య సోనీ సునీల్.. తన స్నేహితురాలు అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి భర్తతో చెప్పింది చాలాసార్లు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాకుండా సొంతంగా ఏదైనా మ్యూజిక్ వీడియో చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సోనీ తన భర్త అనిల్‌కు సలహా ఇచ్చింది.. ‘దేనిమీదో ఎందుకు? నా ఫ్రెండ్ ఎక్స్‌పీరియెన్స్‌నే పాటగా మలిచి.. సంగీతం సమకూర్చి.. వీడియో తీయండి. పైగా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ మీద ముందు అవగాహన కావల్సింది పురుషులకే. అప్పుడే భార్యల మానసిక స్థితిని అర్థం చేసుకొని ఆ సమస్యనుంచి వాళ్లు బయటపడేలా సహాయం చేయగలరు’ అని. భార్య సూచన నచ్చింది అనిల్ ఆనంద్‌కు. వెంటనే పని మొదలుపెట్టాడు. ‘జనన్య’గా మ్యూజిక్ వీడియోను రూపొందించాడు. ఇప్పుడు అది యూట్యూబ్‌లో పెద్ద హిట్. ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అనేది నిజంగానే సీరియస్ ప్రాబ్లం. బిడ్డ పుట్టగానే తండ్రిగా గర్వపడతాం కాని.. భార్య మానసిక, శారీరక ఆరోగ్యాన్ని, ఆమె పరిస్థితిని పట్టించుకోం. అసలు ఆమె మానసికంగా కుంగిపోతుంది. అనే ఆలోచనే రాదు. అందుకే దీని గురించి ముందు ఎడ్యుకేట్ అవ్వాల్సింది మగవాళ్లమే. నా ఈ ‘జనన్య’ మ్యూజిక్ వీడియో ఆ సందేశాన్నే ఇస్తుంది’ అంటాడు దర్శకుడు అనిల్ ఆనంద్. -
మొగుళ్లకు అర్థం కాదా!?
అమ్మ పొత్తిళ్లు బిడ్డకు స్వర్గం అనిపిస్తాయి. మరి అమ్మకో? నలభైతొమ్మిది శాతం బాలింతలకు నరకంగానే అనిపిస్తుందట! ‘ఇంపాజిబుల్. ఇది సత్యం కాదు’ ‘తల్లికి బిడ్డను చూస్తే నరకమా’? ‘యూజ్లెస్ టాక్’!‘బుద్ధిలేనోళ్లు కావాలని ప్రచారం చేస్తున్న అసత్యమిది’. ఇవీ మొగుళ్ల కామెంట్స్. కొంతమంది అత్తలు కూడా ఇదే అంటారేమో!కానీ, పరిశోధన క్లియర్‌గా చెబుతున్న విషయం... ప్రతి ఇద్దరు బాలింతలలో ఒకరు తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతున్నారని! ఈ విషయం అర్థం చేసుకొని బాలింతలకు అండగా నిలవాలన్నదే మనందరి ప్రయత్నం కావాలి. దిస్ ఈజ్ నాట్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. దిస్ ఈజ్ ఎ పాయింట్ ఫర్ యాక్షన్.మొగుళ్లూ... తండ్రులమైపోయామని గొప్పలు చెప్పుకోవడం కాదు...పిల్లల ఆలనాపాలనలో కొంచెం పాలుపంచుకోండి.పెళ్లాలకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. పేరెంట్ అంటే మీరు కూడా సార్! డోన్ట్ ఫర్గెట్!! పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు - ప్రతిదానికి త్వరగా ఏడ్చేయడం - విపరీతంగా చికాకుపడటం - బాధపడటం - చిన్న విషయానికీ విసుగు చెందడం - ఆహారం సహించక పోవడం - నిద్ర లేకపోవడం - కుంగి పోవడం - అనవసర విషయాలకు ఆందోళన చెందడం - లైంగిక వాంఛ తగ్గడం - తప్పు చేసినట్టు భయపడటం - జీవితం శూన్యంగా అనిపించడం బిడ్డ ఏడిస్తే తల్లి ఆనందపడే ఏకైక సందర్భం- జననం. నిజమే! పుట్టిన వెంటనే బిడ్డ ఏడిస్తే తల్లికి ఆనందం. ఆ ఏడుపుతోనే పురిటినొప్పుల యాతనను మర్చిపోవాలి. కాని ఆ ఆనందం స్థానంలో చాలామంది అమ్మలు గుర్తు తెలియని గుబులును మనసులో నింపేసుకుంటున్నారు. వైరాగ్యంలోకి వెళుతున్నారు. శిశు స్వభావాన్ని అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు. అప్పటిదాకా ఆదమరిచి నిద్రపోయిన శిశువు సరిగ్గా ఆమె స్నానానికి వెళ్లగానే గుక్కపట్టి ఏడుస్తుంది. అన్నం తినడానికి కూచుంటే కాలకృత్యాలకు పోతుంది. పగలంతా పడుకుని అమ్మ కనురెప్ప మూతపడే సమయానికి ఆరున్నొక్క రాగం తీస్తుంది. కొత్తలో అమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ అందరూ అండగా ఉంటారు. కాని వాళ్లంతా వెళ్లి తల్లీ బిడ్డా మిగిలాక బేబీ కేరింగ్ బాలింతకు వ్యాకులత కలిగిస్తుంది. బిడ్డ ఏడిస్తే భయం. ఆ బిడ్డను వదిలేసి పారిపోవాలనే కోరిక. నేనొక్కదాన్నే కన్నానా? నాకే ఎందుకు ఇంత పని? పిల్లాడి పనిలో భర్తకు భాగం లేదా? అని మనసులో ఆగ్రహం. తనకు లేని నిద్ర భర్తకు ఎందుకు అనే కసి. ఈ కోపం, బాధ, దిగులు, గుబులు చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే నిస్సహాయతకు దారి తీస్తాయి. దానినే ‘బాలింత వ్యాకులత’ (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) అంటారు. ఇది ఓ మానసిక రుగ్మత. కాని ఆ సంగతి చాలామంది తల్లులకు తెలియనే తెలియదు. దీనికి వైద్యం ఉంటుందనీ తెలియదు. కొన్నిచోట్లయితే బిడ్డ పడుకుని ఉంటేనే బాగుంది అని నల్లమందు ఇచ్చే అమాయకపు అమ్మలూ ఉన్నారు. బాలింత వ్యాకులత లేదా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి వర్గవిభేదాల్లేవ్. షైనీ ఆంటోనీ అందుకు చక్కటి ఉదాహరణ. షైనీ ఆంటొనీ.. పేరున్న షార్ట్ స్టోరీ రైటర్. చేతన్ భగత్ నవలలను ఎడిట్ చేసిన సంపాదకురాలు. ఉరకలేసే ఉత్సాహానికి మారుపేరులా ఉండే షైనీ తన తొలి బిడ్డకు జన్మనిచ్చాక ఒక్కసారిగా దిగాలు పడిపోయింది. తన జీవితమే తారుమారైపోయిందనే బెంగపెట్టుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా అంటారు- ‘ఇరవై నాలుగు గంటలూ చంటిబిడ్డ బాధ్యతలతో గడపడం వల్ల నిద్ర ఉండేది కాదు. దేనిమీదా ఆసక్తి కలిగేది కాదు. ఆ నిరాసక్తత బిడ్డ మీద ప్రభావం చూపేది. శ్రద్ధ పెట్టలేక పోయేదాన్ని. తొలిసారి తల్లి అయిన అనుభూతిని అనుక్షణం ఆస్వాదించాల్సింది పోయి తల్లి హోదాకే చిరాకు పడే స్థితికి చేరుకున్నాను. విసుగు. తెలియని గుబులు. నిర్లిప్తత! ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండేది. పిల్ల ఏడుస్తున్నా... అది ‘ఊ.. ఆ’ అంటూ ముచ్చట పెట్టడానికి ప్రయత్నించినా ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండకపోయేది. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిననే ఫీలింగ్. ఉన్నట్టుండి ఏడుపొచ్చేది. మెటర్నిటీ లీవ్ అయిపోయి ఆఫీస్‌కి వెళ్లాక చాలా రిలీఫ్‌గా అనిపించింది. నిజానికి చాలా మంది తల్లులు ఇంట్లో నెలల పసికందును వదిలి ఆఫీస్‌కి వెళ్తుంటే గిల్ట్‌గా ఫీలవుతారు. నేను మాత్రం హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. ఎన్ని గంటలైనా ఉత్సాహంగా పనిచేసేదాన్ని. ఇంట్లో చంటిబిడ్డ ఉంది.. ఇంటికి వెళ్లాలి అనే పర్మిషన్ ఏనాడూ అడగలేదు. ఆ ఆఫీసే లేకుంటే ఆ టైమ్‌లోనే నేనేమైపోయేదాన్నో’... బేర్‌ఫుట్ అండ్ ప్రెగ్నెంట్ షైనీ అనుభవించిన బాధను సైకియాట్రిక్ సొసైటీ ‘పోస్ట్‌పార్టమ్’ డిప్రెషన్ అంటుంది! వినడానికి చిన్న సమస్యలా ఉండొచ్చు. కానీ అనుభవిస్తున్న వారికి అదో నరకం. ఒక్కోసారి ఒళ్లో బిడ్డను చంపేయాలనుకునే విపరీతానికీ ఒడిగట్టొచ్చు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో దీని మీదున్న మౌనం వీడింది. దీన్నో ఆరోగ్య సమస్యగా గుర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడా ఆ నిశ్శబ్దం బద్దలవ్వాలి. తల్లులకు ముఖ్యంగా కొత్త అమ్మలకు ఈ సమస్యకు సంబంధించిన సమాచారాన్నివ్వాలి. సెలైన్స్.. చాలా పరిష్కారాలను పొట్టన పెట్టుకుంటుంది! నోరు విప్పితేనే పరిష్కారం దొరుకుతుంది! అలా సెలైన్స్‌లో సెటిల్ అయిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ని బ్రేక్ చేయడానికి షైనీ ఆంటోనీ ప్రయత్నించింది. తన అనుభవాలను ‘బేర్‌ఫుట్ అండ్ ప్రెగ్నెంట్’ అనే పేరుతో పుస్తకం రాసింది. కారణాలు బేబీ బ్లూస్ లేదా పోస్ట్‌పార్టమ్ బ్లూస్‌గా పిలిచే ఈ మానసిక స్థితికి హార్మోన్లదే ప్రధాన పాత్ర అని తేలుస్తున్నాయి కొన్ని అధ్యయనాలు. తల్లిలోని థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి ముఖ్య కారణమని చెప్తున్నాయి. దీనికి తోడు గర్భవతిగా ఉన్నప్పుడు మాయ (ప్లాసెంటా) విడుదల చేసే స్ట్రెస్ హార్మోన్ కూడా డెలివరీ తర్వాత తల్లిలో డిప్రెషన్‌ని పెంచుతోందిట. అంతేకాదు.. గర్భవతిలో హెచ్చుస్థాయిలో పెరిగిన ఫీమేల్ హార్మోన్స్ డెలివరీ తర్వాత అత్యంత వేగంగా పడిపోవడమూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి మరోకారణం అని భావిస్తున్నారు మానసిక వైద్యులు. ఎప్పుడు.. ఏంటి.. ఎలా? బిడ్డ పుట్టిన నెల నుంచి యేడాది తర్వాత వరకు ఎప్పుడైనా తల్లులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ‘టీన్స్‌లో తల్లులైన వాళ్లు, కుటుంబంలో డిప్రెషన్ హిస్టరీ ఉన్న వాళ్లు, ఫ్యామిలీ సపోర్ట్ లేనివాళ్లు, భర్తతో కలహాల కాపురం చేస్తున్న వాళ్లకు రిస్క్ ఎక్కువ’ అని చెప్తున్నారు బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సైకియాట్రిస్ట్ అండ్ న్యూరోసైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర నరేన్రావు. తల్లి పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వల్ల బిడ్డ మానసిక స్థితి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. చివరకు వైవాహిక బంధమూ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. మాత్రలు.. కౌన్సెలింగ్ ద్వారా కొంత ఫలితం ఉంటుంది. అలాగే యోగా, ధ్యానం వల్ల కూడా అని చెప్తున్నారు నిపుణులు. ఎలాంటి వైద్యసహాయం పొందకుండా పోస్ట్‌నాటల్ డిప్రెషన్‌తో బాధపడుతున్న స్త్రీలు.. 49 శాతం మంది ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాకులతతో ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్న వాళ్లు 38 శాతమట! - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అవగాహన కావాలి.. కాన్పు తర్వాత తల్లులు ఎదుర్కొనే మానసిక సమస్యలపై ఇతర దేశాల్లో కంటే మన దగ్గర అవగాహన తక్కువనే చెప్పాలి. కాన్పు కారణంగా తల్లుల మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. కోపం, వ్యాకులత, బాధ లాంటి భావాలు ఎక్కువ అవడంతో వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. వాటి బారిన పడకుండా మన ఆడబిడ్డల్ని కాపాడుకోవాలంటే ప్రేమ పూర్వక ఇంటి వాతావరణం ఎంతో దోహద పడుతుంది. అలాంటి కేసుల్లో రెండు వారాలకే తల్లులకు ఈ మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. భర్త, అమ్మానాన్నలు, అత్తామామల నుంచి వారు పొందే ప్రేమ, అభిమానంతోనూ ఆ వ్యాకులత తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో అంతా బాగున్నా సరే తల్లులు పోస్పార్టమ్ బ్లూస్ బారిన పడొచ్చు. అప్పుడు వెంటనే వారిని డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. మన దేశంలో ఇప్పటికీ 60 శాతం నుంచి 70 శాతం మంది తల్లులకు దీనిపై అవగాహన లేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పశ్చిమ దేశాల్లో లాగే మన దగ్గరా చికిత్స, కౌన్సెలింగ్ కేంద్రాలున్నాయి. కానీ ఇక్కడ డాక్టర్లకంటే పేషంట్లు ఎక్కువ. పైగా మన దగ్గర దురదృష్టకర పరిస్థితి ఏంటంటే తల్లుల్లో పోస్ట్‌పార్టమ్ బ్లూస్ లక్షణాలు తీవ్రమయ్యాకే వాళ్లను మా దగ్గరకు తీసుకొస్తారు. అలా కాకుండా ముందు నుంచీ దీని మీద ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తే ఇలాంటి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, హైదరాబాద్