
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
పెరంబూర్: హీరోయిన్ మనీషా యాదవ్ ప్రేమించిన ప్రియుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వళక్కు ఎన్ 18/9 తమిళ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైన నటి మనీషా యాదవ్. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు అందుకుంది.
ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం, పట్టౖయె కెలప్పనుమ్ పాండియా, త్రిష ఇల్లన్న నయనతార చిత్రాల్లో నటించిన మనీషాకు ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన చెన్నై28–2 చిత్రంలో ఐటమ్‌సాంగ్‌లో మెరిసింది. ఆ తరువాత అవకాశాలు తలుపు తడుతున్నా అంగీకరించడం లేదని సమాచారం. ఈ అమ్మడు ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం జోరుగా సాగింది. అది నిజమైంది.
బెంగళూర్‌కు చెందిన వ్యాపారవేత్త వార్నిడ్‌ను ప్రేమించిన మనీషా రెండు రోజుల క్రితం రహస్య వివాహం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరికీ చివరికి తనను పరిచయం చేసిన దర్శకుడు బాలాజీ శక్తివేల్‌కి కూడా ఆహ్వానం పంపలేదు. దీని గురించి మనీషా తల్లి యమున తెలుపుతూ ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే మనీషా పెళ్లి జరిగిందని అన్నారు. వివాహానంతరం మనీషా నటిస్తుందా? లేదా? అన్నది తన భర్త నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.