Youtuber Bumchik Babloo Mayaa Got Secretly Married With His GF In Arya Samaj, Pics Viral - Sakshi
Sakshi News home page

Bumchik Babloo Mayaa Marriage: ప్రేయసిని సీక్రెట్‌గా పెళ్లాడిన కమెడియన్‌

Published Wed, Mar 16 2022 2:02 PM | Last Updated on Wed, Mar 16 2022 4:41 PM

Youtuber Bumchik Babloo Mayaa Got Secretly Married in Arya Samaj - Sakshi

Youtuber Bumchik Babloo Mayaa Got Secretly Married in Arya Samaj: ప్రముఖ యూట్యూబర్‌ బుమ్‌చిక్‌ బబ్లూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. షార్ట్‌ ఫిల్మ్స్‌ నుంచి అలరించిన బబ్లూ ప్రస్తుతం బబ్లూ మాయ అనే యూట్యూబ్‌ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. తాజాగా ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్‌తో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేస్తూ.. జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్‌ అంటూ పోస్ట్‌ చేశాడు.

ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు బబ్లూకి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు. బ్యూటిఫుల్‌ కపుల్‌కి కంగ్రాట్స్‌ అంటూ పులువరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరేమో ఇది నిజమైనా పెళ్లేనా? లేక ఏదైనా వెబ్‌సిరీస్‌ కోసమా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement