Arya Samaj
-
ఏడో నిజాం వాహనంపై బాంబు దాడి.. ఆర్య సమాజ్‌కు సంబంధమేంటి.. అసలు ఆ కథేంటీ?
నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్య సమాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించింది. పౌరుల ప్రాథమిక హక్కులకోసం సత్యాగ్రహం చేసి వేల సంఖ్యలో ఆర్య సమాజ్ నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. కొందరు యువకులు ఏడో నిజాం వాహనంపై బాంబు దాడికి ప్రయత్నించారు. ఈ నిరసన కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగానే జరిగాయి. చదవండి: నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే.. హిందూ మతంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘన చరిత్ర ఆర్య సమాజ్‌ది. అయితే కేవలం ఇది మతానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది యోధులకు కూడా ఆర్యసమాజే స్ఫూర్తినిచ్చింది. వేద విలువలే పునాదిగా దాదాపు 150 సంవత్సరాల క్రితం స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన ఈ సమాజ్.. హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ కీలకపాత్ర పోషించింది. అందులోనూ సుల్తాన్ బజార్ లోని దేవిదీన్ బాగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్య సమాజ్ మందిరాలు అనగానే హైదరాబాద్‌లోని కాచిగూడ, పాతబస్తీలోని శాలిబండ ఆర్య సమాజ్ మందిరాలే ముందుగా గుర్తొస్తాయి. కానీ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని దేవిదీన్ బాగ్ ప్రాంగణం గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది సుల్తాన్‌బజార్ ఆర్యసమాజ్ ఆధ్వర్యంలోనే నడిచేది. ఎంతో మంది ఆర్య సమాజ్ నాయకులకు ఇది సమావేశాల వేదికగా ఉండేది. నిజాం వ్యతిరేక పోరాటానికి తమ కార్యకర్తలను ఇక్కడ నుంచే దిశానిర్దేశం చేసేవారు నాయకులు. ఈ ప్రాంగణంలో ఇప్పుడు ఆర్య కన్య స్కూల్ నడుస్తోంది. దీన్ని ఆర్య సమాజమే నిర్వహిస్తోంది. అప్పుట్లో ఆర్య సమాజ్‌లో క్రియశీల పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధుడు గంగారామ్. నిజాం నిరంకుశ వ్యతిరేక పాలనలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొనడంతో ఆయన చదువును మధ్యలోనే ఆపేశారు. నిజాం పాలనలోని దారుణాలకు వ్యతిరేకంగా ఏడో నిజాం వాహనంపై బాంబుదాడికి ప్రయత్నించిన ఆర్య సమాజ్‌కు చెందిన నారాయణ్‌రావు పవార్, జగదీశ్ ఆర్య, గండయ్యలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు వారిని గుండెల్లో దాచుకున్నారు. నిజాం ప్రభుత్వం ఆ ముగ్గురికీ మరణశిక్ష విధించింది. అయితే అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ .. భారత్‌లో విలీనం కావడంతో ఆ ముగ్గురు విడుదలయ్యారు. 1938-39 మధ్య కాలంలో సుమారు 13 నెలలపాటు ఆర్య సమాజ్ కార్యకర్తలు ప్రాథమిక హక్కులకోసం చేసిన సత్యాగ్రహం కీలకంగా మారింది. ఆ సమయంలో 13 వేల మంది ఆర్యసమాజ నాయకులు, కార్యకర్తలు అరెస్టయ్యారు. ఎంతో మంది జైళ్లలోనే ప్రాణాలు వదిలారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్య సమాజ్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్య సమాజ్ కార్యకర్తల అడ్రస్‌లు తీసుకొని.. వారి క్షేమ సమాచారాలను వారి తల్లిదండ్రులకు ఉత్తరాల ద్వారా తెలిపేవారు నాటి ఆర్య స్టూడియో ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ ముల్కీ. అలా తెర ముందు కొందరు, తెర వెనక మరెందరో ఆనాటి ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. -
‘ఆర్య సమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవ్’
లక్నో: ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో న్యాయ స్థానం తీవ్రంగా స్పందించింది. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో నమ్మకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. ఈ క్రమంలో.. ఆర్య సమాజ్ సొసైటీ ఇచ్చే వివాహ ధ్రువపత్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ఆర్యసమాజ్‌లో ప్రధాన్‌లు ఇచ్చే సర్టిఫికెట్‌కు చట్టబద్ధత లేదు. వివాహాలను తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందేనని స్సష్టం చేసింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్ చేయకపోతే న్యాయస్థానాల పరిధిలో అధికారికంగా గుర్తించలేమని పేర్కొన్నారు. కేవలం ఆ సంస్థ ఇచ్చే పత్రాలు వివాహ చట్టబద్ధతను నిరూపించలేవని అన్నారు. ఒక తండ్రి తన కూతురి విషయంలో అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ సమయంలో.. న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యాం సమాశ్రయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆర్యసమాజ్ సొసైటీలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలతో కోర్టు నిండిపోయింది. ఈ కోర్టు, ఇతర హైకోర్టులలో వివిధ విచారణల సమయంలో వాటి చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పత్రాల వాస్తవికతను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో ఆర్య సమాజ్ సంస్థ నమ్మకాలను దుర్వినియోగం చేసింది. ఈ కేసులో.. వివాహం రిజిస్టర్ కానందున పైన పేర్కొన్న సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే పార్టీలు వివాహం చేసుకున్నట్లు భావించలేము’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దొంగతనానికి వచ్చి కక్కుర్తితో అడ్డంగా బుక్కయ్యారు -
ఆర్యసమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం మనదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా పెళ్లి చేసుకున్నవారికి ఆర్య సమాజ్ నిర్వాహకులు మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. వీటిపై వధూవరుల పేర్లు, వయసు, చిరునామా, ఇతర వివరాలు ఉంటాయి. అయితే, ఇలా వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారం ఆర్యసమాజ్‌కు లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి సర్టిఫికెట్లు చెల్లవని తెలియజేసింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సదరు బాధితురాలు మేజరేనని, వారిద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారని, మ్యారేజ్ సర్టిఫికెట్ సైతం ఉందంటూ నిందితుడి తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరించలేదు. మ్యారేజీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది ప్రభుత్వ సంస్థలు తప్ప ఆర్యసమాజ్ కాదని స్పష్టం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. బాధితురాలి తరపున అడ్వొకేట్ రిషీ మతోలియా హాజరై వాదనలు వినిపించారు. ఆర్యసమాజ్‌లో వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం–1954 ప్రకారం అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 4న స్టే విధించింది. మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై రాజస్తాన్‌లోని పడూకలాన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి బెయిల్ దరఖాస్తును రాజస్తాన్ హైకోర్టు గత నెల 5వ తేదీన తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా భంగపాటే ఎదురయ్యింది. -
ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రముఖ యూట్యూబర్
Youtuber Bumchik Babloo Mayaa Got Secretly Married in Arya Samaj: ప్రముఖ యూట్యూబర్ బుమ్చిక్ బబ్లూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి అలరించిన బబ్లూ ప్రస్తుతం బబ్లూ మాయ అనే యూట్యూబ్ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్తో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేస్తూ.. జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు బబ్లూకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. బ్యూటిఫుల్ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ పులువరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరేమో ఇది నిజమైనా పెళ్లేనా? లేక ఏదైనా వెబ్‌సిరీస్ కోసమా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_mayaa) -
విడదీయాలని చూస్తున్న జ్యోతుల నెహ్రు: ప్రేమజంట
-
'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట ఆరోపిస్తోంది. తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అపర్ణ తల్లిదండ్రులకు తెలపగా వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారు కూకట్పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అపర్ణ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను సంప్రదించగా, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపింది. అయితే విచారణలో భాగంగా గండేపల్లి రావాలని పోలీసులు కోరారు. చదవండి: (అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?) తల్లిదండ్రులనుంచి ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రేమజంట విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని చేతన కన్వినర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహిళా చేతన కన్వినర్ కత్తి పద్మ మాట్లాడుతూ.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని జగ్గంపేట రావాలని జ్యోతుల నెహ్రూ ఒత్తిడి చేయడం సరికాదు. నిజంగా ఆయనకు చట్టంఐ గౌరవం ఉంటే విశాఖపట్నం రావచ్చు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడితే అంగీకరించే పరిస్థితి లేదు' అని కన్వినర్ కత్తి పద్మ అన్నారు. ఈ విషయంపై అపర్ణను సంప్రదించగా.. 'వివాహం విషయంలో మా బంధువులు బ్లాక్ మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా కుటుంబానికి బంధువులు. ఆయన మాపై ఒత్తిడి తెస్తున్నారు. జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే మాకు ప్రమాదం ఉంది' అని అపర్ణ తెలిపింది. -
విదేశీ గడ్డపై వెలిగిన ఖ్యాతి.. న్యూయార్క్ వీధికి రామ్‌లాల్ పేరు
మన ఖ్యాతి మరోసారి విదేశీ గడ్డపై వెలిగింది. న్యూయార్క్‌లో ఓ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరును పెట్టారు. ప్రముఖ మత గురువు, భాషా పండితుడు ‘ధర్మాచార్య’ పండిట్ రామ్‌లాల్ పేరుతో ఓ వీధికి నామకరణం చేయగా, క్వీన్స్ రిచ్మండ్ హిల్‌లో అధికారిక వేడుక నిర్వహించారు. గుయానా స్కెల్డాన్లో భారత మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగారు రామ్‌లాల్. ఆయన అక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1979లో అమెరికా బ్రూక్లిన్కు వెళ్లి అక్కడో ఆస్పత్రిలో పని చేశారు. ఇండో-కరేబియన్ కమ్యూనిటీ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య సమాజం తరపున పనిచేశారు. ముఖ్యంగా హిందీ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గుయానాలో ఉన్నప్పుడు టాగూర్ మెమొరియల్ స్కూల్లో భారతీయ విద్యార్థులకు హిందీ బోధించేవారాయన. 2019లో 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. లిబర్టీ అవెన్యూ, 133వ వీధికి రామ్‌లాల్ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్ నుంచి ప్రతిపాదనలు రాగా, జూన్ 27న న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో సంతకం చేశారు. దీంతో వీధికి రామ్లాల్గా నామకరణం పూర్తికాగా, అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అడ్రిన్నె అడమ్స్ పాల్గొన్నారు. ఇంతకు ముందు న్యూయార్క్‌లో రమేశ్ కాళిచరణ్ వే, జోనాథన్ నారాయిన్ వే, పంజాబ్ అవే, గురుద్వారా వే, లిటిల్ గుయానా అవెన్యూలుగా కొన్ని వీధులకు పేర్లు పెట్టారు. -
అగ్నివేశ్‌కు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. వెట్టి కార్మికులు, స్త్రీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిజమైన సెక్యులర్ నేతగా ఆయనను కొనియాడారు. అగ్నివేశ్ భౌతికకాయానికి శనివారం ఆర్యసమాజ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. సమాజంలో అల్పసంఖ్యాకుల తరఫున ఆయన జీవితాంతం పోరాడారని, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల పక్షాన ఆయన తన గొంతు వినిపించారని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నివాళులు అర్పించారు. దేశంలో మతసామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి మరువలేనిదని మాజీ ప్రధాని మన్మోహన్ కొనియాడారు. వామపక్ష పోరాటాలకు ఆయన గొప్ప స్నేహితుడని, పైకి కాషాయం ధరించినా లోపల నిజమైన సెక్యులర్ అని సీపీఐ లీడర్ డి రాజా ప్రశంసించారు. డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే నేత రామ్‌దాస్ సైతం అగ్నివేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన సిద్ధాంతాలతో విభేదించేవారు ఆయనపై అనేకమార్లు దాడులకు దిగినా, నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డారని లాయర్ మహమూద్ ప్రాచా ప్రశంసించారు. -
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) తుదిశ్వాస విడిచారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో మంగళవారం నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి లా, కామర్స్ డిగ్రీ పొందారు. స్వామి అగ్నివేశ్ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని నడిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
రక్షణ కల్పించండి.. వధువు ఫిర్యాదు
బషీరాబాద్: సార్ మేము గత ఐదేళ్లుగా ప్రేమింకుంటున్నాం. ఇద్దరం మేజర్లం. మా పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మా రెండు కుటుంబాల నుంచి మాకు ప్రాణ హాణి ఉంది. వారి నుంచి రక్షణ కల్పించడండి’’ అంటూ ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నూతన జంట గురువారం బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని జయంతి కాలనీకి చెందిన కొంకల్ స్వప్న, రాకేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది ఇష్టం లేని వీరి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వధువు స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు. అప్పటి వరకు ఇద్దరికి పోలీసు రక్షణ కల్పిస్తామని అన్నారు.(కాళ్ల పారాణి ఆరక ముందే..) -
ఆర్యసమాజ్ C/o ప్రేమ వివాహాలు
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి అనగానే ప్రేమ జంటలకు టక్కున గుర్తొచ్చేది ఆర్యసమాజ్ మాత్రమే. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు ఆర్యసమాజం వేదికగా నిలు స్తోంది. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లిపెద్దలుగా మారి, సాక్షి సంతకాలు చేస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రేమ జంటలు ఒక్కటయ్యాయి. మహర్షి దయానంద సరస్వతి శిష్యుల్లో ఒకరైన స్వామి గిరిజానంద సరస్వతి సుల్తాన్‌బజార్‌లోని బడిచౌడీలో వందేళ్ల క్రితం ఆర్యసమాజాన్ని స్థాపించారు. స్వాతంత్రానికి ముందు నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన అనేక ఉద్యమాలకు ఇది వేదిగా నిలిచింది. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హిందూమత పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అనేక ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలిచింది. ఎలాంటి ఆడంభరాలు లేకుండా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఒక్కటి చేస్తోంది. ‘శుద్ధి సంస్కారం’ తర్వాతే:ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో చాలా వరకు కులాంతర వివాహాలు, పెద్దలు అంగీకరించని వివాహాలే. ఒక వేళ ప్రేమికులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారేతై.. వారిని ముందు çశుద్ధిసంస్కారం(మత మార్పిడి) చేసి, ఆ తర్వాత వారికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండటంతో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అనేక జంటలు ఆసక్తి చూపుతున్నాయి. కేవలం ప్రేమికులే కాకుండా పెళ్లికి ఆర్థిక స్తోమత లేని పేద జంటలు ఈ వేదికపై ఒక్కటవుతుండటం గమనార్హం. ఈ వేదికపై వివాహం చేసుకున్న వారిలో అనేక మంది సంఘ సంస్కర్తలతో పాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఏటా 2 వేలకుపైగా పెళ్లిళ్లు: దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యసమాజ్ శాఖల్లో ఏడాదికి సగటున 50 వేలకుపైగా వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని వందకుపైగా శాఖల్లో ఏటా రెండు వేల వివాహాలు జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావడంతో పాటు పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడటం వల్ల ప్రేమ పెళ్లిళ్లకు వారు పెద్దగా అభ్యంతరం చెప్పక పోవడమే ఇందుకు కార ణమని ఆచార్య అమర్‌సింగ్ ఆర్య పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆర్యసమాజ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. పిల్లల పెళ్లి వివరాలను గోప్యంగా ఉంచుతుండటంతో పాటు తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం వల్ల వారి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. -
పోలీసుల సమక్షంలో ప్రేమ జంట పెళ్లి
-
పోలీసుల సమక్షంలో ప్రాణదీప్ - సౌజన్య పెళ్లి
సాక్షి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన ప్రేమజంట పెళ్లి వ్యవహారం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. బుధవారం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామనుకున్న ప్రాణదీప్, సౌజన్యలను యువతి కుంటుంబ సభ్యులు విడదీసిన సంగతి తెలిసిందే. పెళ్లి పీటలపై నుంచి తనకు కాబోయే భార్యను ఎత్తుకెళ్లారని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతీ, యువకులు మేజర్లు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాలుగా తీసుకున్నారు. ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్ చేయగా.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెపింది. దీంతో వారిద్దరినీ టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల సెక్యూరిటీ మధ్య శుక్రవారం పట్టణంలోని ఆర్యసమాజ్‌లో స్నేహితుల సమక్షంలో ప్రాణదీప్, సౌజన్య వివాహం జరిగింది. కాగా, ఇష్టపడే వివాహం చేసుకున్నానని.. తనపై ఎవరి ఒత్తిడి లేదని యువతి కోర్టులో చెప్పడంతో పోలీసులు సౌజన్య కుంటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసు సమోదు చేశారు. -
ప్రాణదీప్- సౌజన్య ప్రేమకథ సుఖాంతం
సాక్షి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారిన ప్రేమజంట పెళ్లి వ్యవహారం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో ఐదు నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా ఆర్య సమాజ్‌కు చేరుకున్న సౌజన్య బంధువులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో పెళ్లి కొడుకు స్నేహితులు పోలీసులకు ఫోన్ చేయగా.. వారు అక్కడికి చేరుకునేలోపే బంధువులు సౌజన్యను మక్లూరుకు తీసుకెళ్లారు. వెంటనే మక్లూరు వెళ్లిన టూ టౌన్ పోలీసులు బాధిత యువతిని కలిశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సెక్షన్ 365 కింద కుటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్ చేయగా.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరినీ టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా 24 గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం పోలీసుల సహకారంతో చివరికి ప్రేమజంట ఒక్కటి కానుంది. -
5 నిమిషాల్లో పెళ్లి.. ప్రేమికులను విడదీశారు..
సాక్షి, నిజామాబాద్ : మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో బైక్‌లతో ఆర్య సమాజ్‌కు చేరుకున్న అమ్మాయి తరఫు బంధువులు పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయిని లాక్కెళ్లబోయారు. ఇంతలో వరుడు అడ్డుపడటంతో అతన్ని చితక్కొట్టారు. అనంతరం తమతో రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయి చెంపలు వాయించారు. ఆపై భుజాన వేసుకుని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆర్య సమాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీల హడావుడిలో ఉన్న పోలీసులు ఆర్య సమాజ్‌కు చేరుకోవడం ఆలస్యమైంది. -
వేదాల పునాదిపై జాతి సంస్కతి
– ఆర్య సమాజ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రయ్య మహబూబ్‌నగర్ కల్చరల్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ సంస్కతి వేదాల పునాదిపై నిర్మంచబడిందని ఆర్యసమాజ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ చంద్రయ్య అన్నారు. ఆర్య సమాజ్ ఆద్వర్యంలో స్థానిక బ్రాహ్మణవాడిలోని సమాజం మందిరంలో మూడు రోజులపాటు నిర్వహించిన యజుర్వేద పారాయణ మహాయజ్ఞం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ యజ్ఞాల వల్ల వాతావరణంలోని కాలుష్యం అంతరిస్తుందని, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రాలు, వేదపురాణాలు తెలుపుతున్నాయని అన్నారు. «ధర్మప్రబోధాల ద్వారా శాంతియుత సహజీవనాన్ని కొనసాగించవచ్చని అన్నారు. తమ సంస్థ పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో పాపభీతి, దైవభక్తి పెంచుతున్నదని వెల్లడించారు. ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ధార్మికవేత్తలు ఆచార్య విశ్వ, కేవీరెడ్డి యాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రతినిధులు నర్సింహరెడ్డి, జయపాల్ సులాఖే, కిషన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెళ్లి చేసుకున్న పిచాయ్ మామ
జైపూర్ : గూగుల్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి సుందర్ పిచాయ్ మామయ్య ఓలారామ్ హర్యానీ (70) మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. రాజస్థాన్‌లోని ఆర్య సమాజ కార్యాలయంలో ఆ సంస్థ ఆచారాలకు అనుగుణంగా మంగళవారం మాధురి శర్మ (65)ను ఆయన వివాహం చేసుకున్నారు. మాధురీ శర్మ రాజస్థాన్‌లోని కోట నివాసి. ఆమె భర్త మిలటరీలో పని చేసే వారు. ఆయన మరణించారు. ఓలారామ్ కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన ముంబైలో నివసిస్తున్నారు. ఓలారామ్ మొదటి భార్య మరణించారు. ఓలారామ్కు ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. ఓలారామ్ కుమార్తె అంజలిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.