సాక్షి, నిజామాబాద్ : మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది.
పదుల సంఖ్యలో బైక్‌లతో ఆర్య సమాజ్‌కు చేరుకున్న అమ్మాయి తరఫు బంధువులు పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయిని లాక్కెళ్లబోయారు. ఇంతలో వరుడు అడ్డుపడటంతో అతన్ని చితక్కొట్టారు.
అనంతరం తమతో రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయి చెంపలు వాయించారు. ఆపై భుజాన వేసుకుని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆర్య సమాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీల హడావుడిలో ఉన్న పోలీసులు ఆర్య సమాజ్‌కు చేరుకోవడం ఆలస్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment