
పోలీసులను ఆశ్రయించిన నూతన జంట
బషీరాబాద్: సార్ మేము గత ఐదేళ్లుగా ప్రేమింకుంటున్నాం. ఇద్దరం మేజర్‌లం. మా పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మా రెండు కుటుంబాల నుంచి మాకు ప్రాణ హాణి ఉంది. వారి నుంచి రక్షణ కల్పించడండి’’ అంటూ ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నూతన జంట గురువారం బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని జయంతి కాలనీకి చెందిన కొంకల్ స్వప్న, రాకేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది ఇష్టం లేని వీరి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వధువు స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. అప్పటి వరకు ఇద్దరికి పోలీసు రక్షణ కల్పిస్తామని అన్నారు.(కాళ్ల పారాణి ఆరక ముందే..)
Comments
Please login to add a commentAdd a comment